మే23 నుంచి జూన్3 వరకు దరఖాస్తులు చేసుకోవాలి


Thu,May 23, 2019 01:44 AM

నాగర్‌కర్నూల్ రూరల్ : జిల్లా కేంద్రంలోని నెల్లికొండగౌట్ సమీపంలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రా అడ్మిషన్ ప్రక్రియలో విద్యార్థుల కోసం దోస్త్ సేవా కేంద్రం ఏర్పాటు చేసినట్లు డిగ్రీ కళాశాలల నోడల్ అధికారి మధుసుదన్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులు ఏవైనా సమస్యలు, సందేహాలు ఉంటే దోస్త్ ఆన్‌లైన్ సెంటర్‌లో నవృత్తి చేసుకునేందుకు ఈ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు ఏవైనా సమస్యలుంటే నేరుగా హెల్ప్‌లైన్‌సెంటర్‌కు వస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా దోస్త్ ద్వార దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. దోస్త్ హెల్ప్‌లైన్ సెంటర్లు ప్రబుత్వ డిగ్రీ కళాశాలల్లోనే అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలో కేవలం ఐదు డిగ్రీ కళాశాలల్లో మాత్రమే హెల్ప్‌లైన్ సెంటర్లు ఉన్నాయన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలతో పాటుగా జిల్లాలోని కల్వకుర్తి, కొండనాగుల, కొల్లాపూర్, అమ్రాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో ఉన్న దోస్త్ హెల్ప్‌లైన్ సెంటర్ల ద్వారా పేద విద్యార్థులు అడ్మిషన్ పొందేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఆసక్తిగల విద్యార్థులు మే23 నుంచి జూన్3 వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వివరాల కోసం హెల్ప్‌లన్ సెంటర్ 9381959947లో సంప్రదించాలన్నారు.

102
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...