రైతుల రక్షణ కవచం తెలంగాణ సర్కార్


Thu,May 23, 2019 01:44 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : రైతుల రక్షణ కవచంగా తెలంగాణ సర్కార్ నిలిచిందని రాష్ట్ర ఎక్సైజ్, యువజన సర్వీసులు, క్రీడలు, పురవాస్తు, సంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఇటీవల విడుదలైన సూపర్‌స్టార్ ప్రిన్స్ మహేష్‌బాబు హీరోగా నటించిన మహర్షి సినిమా విడుదలై అందరి మన్ననలు పొందుతోంది. ఈ క్రమంలో మహర్షి సినిమాలో న టించిన హీరో అల్లరి నరేష్, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్‌రాజుతో పాటు పలువురు ప్రముఖులు బుధవారం జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర థియేటర్‌లో చిత్రం సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ మేరకు శ్రీ జయరామ మోటర్స్ అధినేత బెక్కరి రాంరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ప్రదర్శించిన షోకు చిత్రబృందంతోపాటు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడారు. మనిషి మనుగడకు రైతే రాజు అనే కోణంలో రైతు గొప్పతనం సినిమాలో చూపించిన తీరు అద్భుతంగా ఉందని పలువురు ప్రముఖులు చిత్రయూనిట్‌ను అభినందించారు. ఈ సందర్భంగా పలువురు రైతులను మంత్రి, చిత్ర యూనిట్ సభ్యులు సన్మానించారు. కార్యక్రమం లో జీఎం సర్పయ్య, మారుతి సెల్స్ మేనేజర్ వేణుగోపాల్‌రెడ్డి, మహేంద్ర ట్రాక్టర్స్ సేల్స్ మేనేజర్ రాజమూర్తి, ఎల్లారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, విక్రం, రమణ, నర్సింహ్మారెడ్డి తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందంను, పలువురు రైతులను రైతుపాత్రలో నటించిన గురుస్వామిని మంత్రి శాలువా, పూలమాలతో సన్మానించారు. చిత్రబృందం ఈ సందర్భంగా కేక్‌కట్ చేసి తమ సంతోషాన్ని పంచుకున్నారు.

నిత్యం బిజీబిజీగా ఉండే మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సినిమా థియేటర్లలో ప్రేక్షకులు, రైతులు సమక్షంలో కూర్చుని గంటకు పైగా సినిమా చూశారు. ఈ మేరకు ప్రేక్షకులు మంత్రి తో కలిసి సినిమా చూడడంతో వారు రెట్టింపు సంతోషం వ్యక్తం చేశారు. మహర్షి విజయయాత్ర విజయవంతంగా సాగింది.

రైతే మహరాజు : మంత్రి శ్రీనివాస్‌గౌడ్
ఆకలి వేస్తే అన్నం గుర్తుకు వస్తుంది. అన్నం నీ ముం దుకు వచ్చేందుకు రాత్రి, పగలు ఎంతో శ్రమించిన రైతును మాత్రం కొందరే గుర్తుపెట్టుకుని స్మరించుకుంటారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మహర్షి సినిమాలో హీరో మహేష్‌బాబు నటించిన తీరు చాలా బాగుందని, దర్శకుడు వంశీ పైడిపల్లి తీసిన విధానం అందర్ని అలరింపజేసి, ఎంతో మందిని ఆలోచింపజేసే విధంగా ఉందన్నారు. ముఖ్యంగా రైతు కష్టంను బాగా చూయించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా నిలబడుతుందని, ఎక్కడ ఎలాంటి సమస్య ఉన్నా ప్రతి సమస్యను పరిష్కరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. నిర్మాత దిల్‌రాజు మంచి కథలకు ప్రాణం పోస్తు నిర్మింస్తున్నారని, మునుముందు మరిన్ని విజయవంతమైన సినిమాలను నిర్మించాలని సూచించారు. ప్రతి ఒక్కరు రైతు కష్టం గూర్చి రైతుకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...