ప్రమాదకర జరభద్రం


Thu,May 23, 2019 01:43 AM

వంగూరు:మండలంలోని తిప్పారెడ్డిపల్లి గ్రామంలో గల మలుపు ప్రమాదాలకు పిలుపుగా మారింది.వంగూరు మండల కేంద్రం గూండా ఉమ్మాపూర్, మీదుగా డిండికి వెళ్లె రోడ్డు తిప్పారెడ్డిపల్లి గ్రామంలో 90 డిగ్రీల స్థాయిలో తీవ్రమైన మలుపు ఉండటంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్డు వెంబడి నిత్యం ఆర్టీసీ బస్సులతో పాటు వందల వాహనాలు ప్రయాణిస్తుంటాయి. మండల కేంద్రానికి నిత్యం వందల సంఖ్యలో వివిధ పనుల నిమిత్తం ఈ రోడ్డు గుండా ప్రయాణిస్తుంటారు.అలాగే నల్గోండ జిల్లా డిండి మండల కేంద్రానికి వాణిజ్య పరంగా సమీప గ్రామాల ప్రజలు ఈ రోడ్డు గుండానే వెళ్తుంటారు. ఆరు నెలల వ్యవధిలో తిప్పారెడ్డిపల్లి గ్రామంలోని ఈ మలుపు వద్ద పలు వాహనాలు ప్రమాదాలకు గురై పదుల సంఖ్యలో ప్రజలు గాయాల బారీన పడిన సంఘటనటు చోటు చేసుకున్నాయి. మద్య కాలంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొని ఇద్దరికి తీవ్రంగా గాయాలయాయి.గ్రామంలోని ఈ మలుపును సరి చేయడంలో సంబంధిత శాఖ అధికారులు విఫలం చెందారు.ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు కానీ సంబంధిత అధికారులు కానీ స్పందించి ఈ రోడ్డు వద్ద ప్రమాద సూచికలు కానీ మలుపును సరి చేసి ప్రమాదాలను అరికట్టాలని సమీప గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...