తల్లిదండ్రులను దైవంగా చూసుకోవాలి


Thu,May 23, 2019 01:43 AM

దామరగిద్ద: తల్లిదండ్రులే దైవమని, వారిని కష్టపెట్టకుండా చూసుకోవాలని ఈటీవీ జబర్దస్త్ కమేడియన్ సనామీ సుధాకర్ అన్నారు. మండల కేంద్రంలో మాజీ సర్పంచ్, టీఆర్‌ఎస్ నాయకులు భీమయ్యగౌడ్ ఏర్పాటు చేసిన సన్మానసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎక్కువ షోలు చేసినందుకు గాను ఇటీవల అమెరికాకు చెందిన రాయల్ అకాడమీ దుబాయ్‌లో డాక్టరేట్ ప్రదానం చేశారని, జబర్దస్త్ న్యాయనిర్ణేతలు నాగబాబు, రోజా అభినందించారని తెలిపారు. ఈ స్థాయికి రావడానికి మా నాన్న విశ్రాంత ఉపాధ్యాయులు ఆంజేయులుగౌడ్ కృషి చాలా ఉందని, డాక్టరేట్‌ను మా తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సభ్యురాలు వెంకటమ్మ, మాజీ సర్పంచ్‌లు భీమయ్యగౌడ్, ఈదప్ప, రవీంద్రనాథ్, సుధాకర్ చిన్ననాటి స్నేహితులు కేఎన్‌రెడ్డి, ఖాజీమియా, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...