రంజాన్ కానుక...!


Sun,May 19, 2019 02:12 AM

-పేద ముస్లింలకు పండగ దుస్తులు
-మసీద్ కమిటీలచే లబ్ధిదారుల ఎంపిక
-దావత్-ఏ ఇఫ్తార్‌కు రూ.13లక్షలు..
-ఏర్పాట్లు చేపట్టిన మైనార్టీ సంక్షేమ శాఖ

నాగర్‌కర్నూల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి : నాగర్‌కర్నూల్ జిల్లాలోని పేద ముస్లింలకు రంజాన్ కానుక అందజేసేందుకు తెలంగాణ మైనార్టీ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలోని కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా 6500మంది పేద ముస్లింలను ఆయా మసీద్ కమిటీల ద్వారా గుర్తించడం జరిగింది. పేదలకు రంజాన్ సందర్భంగా ప్రభుత్వం నూతన దుస్తులను అందజేయనుంది. దీనికోసం ప్రత్యేకంగా గిఫ్ట్ ప్యాక్‌లను హైదరాబాద్ నుంచి జిల్లా కేంద్రానికి చేరవేసింది. ఈ గిఫ్ట్ ప్యాకుల్లో యజమానికి కుర్తా పైజామా, భార్యకు చీర, ఒక డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి. ఈ ప్యాక్‌లను రంజాన్ కంటే ముందుగా ఆయా ముస్లింలకు అందజేస్తారు. ఇప్పటికే జిల్లా కేంద్రానికి చేరిన గిఫ్ట్ ప్యాక్‌లను స్థానిక మైనార్టీ గురుకుల పాఠశాలలో భద్రపరిచారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పంపిణీ ప్రక్రియ జరపడం లేదు. ఈనెల 27న ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఆయా నియోజకవర్గాలకు గిఫ్ట్ ప్యాక్‌లను తరలిస్తారు. అక్కడి నుంచి రెవెన్యూ శాఖ సహకారంతో మండలాల వారీగా పంపిణీ చేపట్టే అవకాశముంది. ఇక రంజాన్ దావత్‌లను కూడా ప్రభుత్వమే అధికారికంగా ఇవ్వనుండటం విశేషం. ఈ దావత్ కోసం నాగర్‌కర్నూ ల్ జిల్లాకు రూ.13లక్షలను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఖాతాలో ఈ డబ్బులు జమ అయ్యాయి. నియోజకవర్గ కేంద్రాల్లో దావత్ ఏ ఇఫ్తార్ ఇవ్వనున్నారు. అయితే కొందరు మండలాల వారీగా నిర్వహించుకుంటామని అధికారులకు పేర్కొంటుండటంతో ఆయా మసీద్ కమిటీల నిర్ణయం మేరకు చర్యలు తీసుకొంటారు.

రంజాన్ మాసంలో ముస్లింలు సాయంత్రం వేళ చేసే భోజనాన్ని ఇఫ్తార్‌గా పేర్కొంటారు. ఈ ఇఫ్తార్ సందర్భంగా మటన్ బిర్యానీతో పాటుగా పండ్లు, హలీమ్‌లాంటి ము స్లింలు పండుగలో చేసే భోజనాన్ని సాంప్రపదాయబద్ధంగా ఇవ్వనున్నారు. ఇప్పటికే మసీద్ కమిటీలకు దుస్తుల పంపిణీ, దావత్ ఏ ఇఫ్తార్ నిర్వహణపై అధికారులు సమాచారం ఇచ్చారు. మంచి ఉద్దేశ్యంతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని అధికారులు ముస్లిం మత పెద్దల ను కోరారు. ఈ విందుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధులు సహా అధికారులు కూడా భాగమై ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. దీనివల్ల పేద ముస్లింల్లో భరోసా ఇవ్వాలనేది ప్రభుత్వ స ంక ల్పం. ఇలా ప్రభుత్వం పేద ముస్లింలు రంజాన్ పండుగను సంబురంగా చేసుకొనేందుకు గిఫ్ట్ ప్యాక్‌లు, దావత్ ఏ ఇఫ్తార్‌లు ఏర్పాటు చేయనుండటంపై ముస్లింలలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి హిందువుల పెద్ద పండుగ బతుకమ్మకు, క్రిష్టియన్ల పవిత్ర క్రిస్మస్‌తో పాటుగా ముస్లింలకు రంజాన్ సందర్భంగా దుస్తుల పంపిణీ చేపడుతోంది. పేదలు ఆర్థిక ఇబ్బందులతో పండుగలకు దూరం కాకూడదనే సదుద్దేశ్యంతో ప్రభుత్వం నాలుగేళ్ల నుంచీ ఇదే వి ధంగా దుస్తులను అందజేయడం జరుగుతోంది. రెండోసారి అధికారంలోకి వచ్చాక కూడా తొలిసారిగా ముస్లింల రంజాన్ పండుగ రావడంతో దుస్తుల పంపిణీకి చర్యలు చేపట్టింది. కాగా ఎన్నికల కోడ్ వల్ల పంపిణీకి ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు. ఈనెల 27న ఎన్నికల కోడ్ ముగుస్తు ంది. అనంతరం ఎమ్మెల్యేలతో మా ట్లాడి ఏయే రోజుల్లో పంపిణీ చేయనున్నారో మై నార్టీ శాఖ అదికారులు తేదీలు నిర్ణయిస్తారు. ఆ ప్రకారంగా ముస్లింలకు గిఫ్ట్ ప్యాక్‌లు, దావత్‌లు అందజేస్తారు.

కోడ్ ముగిసిన వెంటనే గిఫ్ట్‌ప్యాక్‌ల పంపిణీ
రంజాన్ పండుగ సందర్భంగా పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ నెల 27న ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఎమ్మెల్యేల సూచనల మేరకు పంపిణీ చేపడతాం. జిల్లా కేంద్రంలోని గురుకుల పాఠశాలలో గిఫ్ట్ ప్యాక్‌లను భద్రపరిచాం.దావత్ ఏ ఇఫ్తార్ కో సం రూ.13 లక్షలుమంజూరయ్యాయి. రంజాన్ పండుగను ముస్లింలు సంతోషంగా జరుపుకొనేలా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏ ర్పాట్లు చేస్తున్నాం.
- దస్తగిరి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...