నాసిరకం విత్తనాలు తయారు చేస్తే కఠిన చర్యలు


Sun,May 19, 2019 02:11 AM

భూత్పూర్ : రైతులకు నష్టం కల్గించే విధంగా నాసిరకం విత్తనాలు తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ ఎస్‌కే.సింగ్ అన్నారు. భూత్పూర్‌లోని సాయి భవ్య అగ్రిటెక్ సిడ్ పరిశ్రమతోపాటు, పాలుమూరు సిడ్స్ పరిశ్రమను ఆయన టాక్స్‌ఫోర్స్ బృందం సభ్యులతోపాటు కలిసి తనిఖీ చేశారు. విత్తన పరిశ్రమలో విత్తనా ల తయారీ విధానం, తయారు చేసిన విత్తనాలను పరిశీలించారు. అదేవిధంగా విత్తన నిల్వలతో పాటు, అ మ్మకాలకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఎస్‌కే.సింగ్ మాట్లాడుతూ నాసిరకం విత్తనాలు తయారు చేసే వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేయడంతోపాటు అవసరమైతే పరిశ్రమను కూడా సీజ్ చేస్తామని చెప్పారు. విత్తన పరిశ్రమలలో నాసిరకం విత్తనాలు తయారు చేయవద్దని, చేస్తే మన ప్రాంత రైతులే నష్టం జరుగుతుందని తెలిపారు. నాసిరకం విత్తనాలతో రైతులకు నష్టం జరిగితే ఉపేక్షించేది లేదని, అక్రమ సంపాదన కోసం రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా స్థానిక వ్యవసాయాధికారులు నకిలీ విత్తనాల తయారీని అడ్డుకోవడం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని అధికారులతో ఆరా తీ శారు. ముమ్మర తనిఖీలతోనే నాసిరకం విత్తనాల తయారీని అరికట్టవచ్చని వారికి సూచించారు. ఆయన వెంట టాస్క్‌ఫో ర్స్ ఏడీఏ వెంకటేశ్వర్లు, ఎస్సై దుర్గారావు, స్థానికి వ్యవసాయ శాఖ ఏడీఏ యశ్వంత్‌రావు, అడ్డాకుల ఏవో శ్రీనివాసులు, భూత్పూర్ ఎస్సై పర్వతాలు ఉన్నారు. అనంతరం భూత్పూర్‌లోని నవతా ట్రాన్స్‌ఫోర్స్, గ్రో మోర్, వెంకటేశ్వర ట్రేడర్స్, అన్నపుర్ణ విత్తన విక్రయ దుకాణాలను ఏడీఏ యశ్వంత్‌రావు ఆధ్వర్యంలో అధికారులు తనిఖీ చేశారు. అదేవిధంగా వచ్చిన విత్తనాలతోపాటు, అమ్మకాలు, నిల్వకు సంబంధించిన రికార్డులను ఏడీఏ పరిశీలించారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...