కౌంటింగ్ కేంద్రాల్లో చేయాలి


Sun,May 19, 2019 02:11 AM

నాగర్‌కర్నూల్‌రూరల్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీల కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు గాను మే 27వ తేదీన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ కౌంటింగ్ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను మూడు దశల్లో నిర్వహించాలని అధికారులకు, రిటర్నింగ్ అధికారులకు సూచించారు. మొదటి దశలో బ్యాలెట్ పేపర్లు, సదరు బూత్‌లో ఉన్న ఓటర్ల వివరాలతో లెక్కిస్తారన్నారు. ఇది పోలింగ్ కేంద్రాల వారిగా జరుగుతుందన్నారు. ఆ తర్వాత వీటిని బండిల్ చేస్తారని, అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారిగా విడదీసి ఒక్కో బండిల్‌లో 25 బ్యాలెట్ పత్రాలు ఉంటాయన్నారు. రెండో దశలో ఎంపీటీసీ ఎన్నిక కౌంటింగ్ మొదలు పెడతారని, ఒక్కో ఎంపీటీసీ స్థానానికి రెండు టేబుళ్లు, రెండు రౌండ్లు ఉంటాయన్నారు. ఆ విధమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు. ప్రతి బ్యాలెట్ పేపర్‌ను ఓపెన్ చేసి చెల్లుబాటు అవుతుందా లేదా అనేది ఏజెంట్ల ముందు చూపించాలని తెలిపారు. చెల్లుబాటు అయితే ఎంపీటీసీ స్థానాల్లోని ట్రేలో వేస్తారని, అనుమానాలు వ్యక్తం చేస్తే మాత్రం రిటర్నింగ్ అధికారుల దగ్గరకు పంపించి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని కౌంటింగ్ కేంద్రంలో అన్ని ఏర్పాటు వెలుతురు, కరెంట్ సమస్య ఉన్న చోట జనరేటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 20 మండలాల బ్యాలెట్ బాక్సులను పాలెం, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట నాలుగు ప్రదేశాల్లో స్ట్రాంగ్ రూమ్‌ల్లో కౌంటింగ్ ప్రదేశాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఎన్నికల కౌంటింగ్ సిబ్బంది 27వ తేదీన నిర్వహించునున్న కౌంటింగ్ పకడ్భందీగా నిర్వహించాలని సూచించారు.
పేపర్ కౌంటింగ్ విధానాన్ని అప్రమత్తతో నిర్వర్తించాలని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కౌంటింగ్ విధానాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ శిక్షణ తరగతుల్లో డీపీవో సురేశ్‌మోహన్, పరిషత్ ఎన్నికల కార్య నిర్వహణాధికారి మొగులప్ప, జిల్లా అధికారులు మోహన్‌రెడ్డి, అనిల్ ప్రకాశ్ అఖిలేశ్‌రెడ్డి, మోహన్‌బాబు, చంద్రశేఖర్‌రావు, యాదయ్య పాల్గొన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...