ఏపీ ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలి


Sun,May 19, 2019 02:11 AM

అలంపూర్, నమస్తే తెలంగాణ : ఈనెల 11న కర్నూల్ జిల్లాలోని వెల్దుర్తి ప్రమాదంలో మృతి చెంది న 17 మంది మృతుల కుటుంబాలను ఏపీ ప్రభు త్వం ఆర్థికంగా ఆదుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం కర్నూల్ డీఆర్‌వో వెంకటేశంను కోరారు. శనివారం కర్నూల్ కలెక్టర్ కార్యాలయంలో డీఆర్‌వోను కలిసి వడ్డెపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన 16 మంది మృతుల కుటుంబాలతోపాటు కర్నూల్ జిల్లాకు చెందిన మృతుడి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా అందజేసి భరో సా కల్పించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే వివరించారు. కుటుంబాలకు పెద్ద దిక్కుగా ఉన్న తండ్రు లు కోల్పోవడంతో భార్యలు, పిల్లలు, తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటుందని, ఏపీ ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశా రు. ఈ విషయమై ఇప్పటికే కర్నూల్ కలెక్టర్ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారని, అందుకుసంబంధించిన లేఖను ఎమ్మె ల్యే అబ్రహంకు డీఆరశో అందజేశారు. ఏపీ ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకుంటామని డీఆర్‌వో హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే అబ్రహం తెలిపారు. డీఆర్‌వోను కలిసిన వారిలో యువ నాయకులు కిశోర్, వడ్డెపల్లి జెడ్పీటీసీ అభ్యర్థి రాజు, షేక్షావలి, మతిన్ భాషా గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...