తలదాచుకునేందుకు వెళ్లి..తిరిగిరాని లోకాలకు..


Sat,May 18, 2019 05:53 AM

కొల్లాపూర్ టౌన్: పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్‌లో శుక్రవారం పెను విషాదం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. శుక్రవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో గ్రామ సమీపంలోని రాయికుంట పోలిగుండ్ల పొలంలో నాగరాజు(14) విద్యార్థి తల్లి అలివేలమ్మతో కలిసి గొర్రెలను మేపుతున్నాడు. సమీపంలోని వ్యవసాయ పొలంలో మేతను గొర్రెల మందకు తీసుకువచ్చేందుకు వెళ్తుండగా వర్షం రావడంతో తలదాచుకునేందుకు సమీపంలో గుండ్ల సర్ప ప్రాంతానికి చేరుకున్నాడు. అదే సమయంలో ప్రమాదవశాత్తు పిడుగు పడి నాగరాజు అక్కడిక్కడే మృతి చెందాడు. అలివేలమ్మ కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సమీపంలో అడ్డబాట మశమ్మ ప్రాంతంలో చెట్టుపై పిడుగు పడి అక్కడే ఉన్న ఆవు, ఎద్దు, శునకం మృత్యువాత పడ్డాయి. విషయం తెలిసిన సాతాపూర్, నారాయణపల్లి, తదితర ప్రాంతాల నుంచి వారి బంధువులు, ప్రజలు చేరుకొని సంఘటనను చూసి విలపించారు. నాగరాజు మృతదేహాన్ని సాతాపూర్‌కు తరలించారు. స్థానిక ఎంఆర్‌ఐ సంఘటనపై పంచనామా నిర్వహించారు. బాధిత కుటుంబాన్ని వివిధ రాజకీయ పక్షాలనాయకులు చిన్న ఉస్సేన్, పుల్లయ్య, కట్ట వంశీగౌడ్, నాగులు, గోపాల్‌రావు, శివ, నారాయణరావు, పరుశరాములు, వెంకటస్వామి తదితరులు పరామర్శించారు. బాధత కుటుంబాన్ని ఆన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...