హెడ్‌కానిస్టేబుల్‌ను అభినందించిన ఎమ్మెల్యే


Fri,May 17, 2019 02:34 AM

అచ్చంపేట, నమస్తే తెలంగాణ: కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌కు హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి రావడంతో గురువారం స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్వీటు తినిపించి అభినందించారు. శ్రీనివాస్‌ ఎమ్మెల్యే వద్ద గన్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. క్యాంపు కార్యాలయం నందు అభినందించారు. ఎలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వొద్దునాగర్‌కర్నూల్‌ రూరల్‌: ఎలాంటి తప్పులకు ఆస్కారం ఇవ్వకుండా లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించాలని నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి, నాగర్‌కర్నూల్‌ పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి శ్రీధర్‌ అన్నారు. గురువారం నాగర్‌కర్నూల్‌లోని లహరి గార్డెన్‌లో 23న పార్లమెంట్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపును చేపట్టనున్న దృష్ట్యా అసెంబ్లీ సెగ్మెంట్ల సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఓట్ల లెక్కింపులో భాగంగా సిబ్బంది 23వ తేదీ ఉదయం 6:30 గంటలకు వారికి కేటాయించిన కౌంటింగ్‌ కేంద్రంలో విధులకు హాజరు కావాలని కలెక్టర్‌ చెప్పారు. ర్యాండమైజేషన్‌ ద్వారా సిబ్బందికి ఓట్ల లెక్కింపు విధులను కేటాయించడం జరుగుతుందన్నారు.

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించి తప్పులకు బాధ్యులు అయినట్లయితే ఇండియన్‌ పీనల్‌ కోడ్‌, ప్రజాప్రాతినిధ్య చట్టం మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో క్రమశిక్షణ చాలా ముఖ్యమన్నారు. కౌంటింగ్‌ కేంద్రం బారికేడ్లు, వైర్‌ మెష్‌, టేబుళ్లు, ఇతర కౌంటింగ్‌ సామగ్రి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. కేటాయించిన టేబుల్‌ వద్ద సిబ్బంది వారి విధులను నిర్వహించాలని తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి సెల్‌ఫోన్లు, కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు అనుమతించబడవని, సిబ్బంది ఎలాంటి సామగ్రి లేకుండా ఓట్ల లెక్కింపు విధులకు రావాలన్నారు. ఒకవేళ ఏదైనా సామగ్రితో వస్తే నిర్దేశించిన కౌంటర్‌ వద్ద వాటిని డిపాజిట్‌ చేయాలని తెలిపారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా మూడంచెల భద్రత కల్పించడం జరిగిందని, సెంట్రల్‌ స్టేట్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌తో పాటు సివిల్‌ పోలీసులు భద్రత నిర్వహిస్తారన్నారు. సిబ్బందికి అవసరమైన భోజనం, తాగునీటి సదుపాయాలు కల్పించడం జరుగుతుందని, ఎలాంటి సామగ్రిని తీసుకురావద్దన్నారు.

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతనే వీవీ, పీఏటీలలోని ఓటరు స్లిప్పులను లెక్కించడం జరుగుతుందని కలెక్టర్‌ స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు ఉయ్యాలవాడలోని మోడల్‌ బీఈడీ కళాశాల, నెల్లికొండ మార్కెట్‌ గోదాములో నిర్వహిస్తున్నందున ముందుగా ఆయా సెగ్మెంట్ల వారిగా, రౌండ్‌ల వారిగా ఫలితాలు వెలువడుతాయన్నారు. ఈవీఎంల ద్వారా ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం ఓటరు స్లిస్పులను లెక్కించడం జరుగుతుందన్నారు. కౌంటింగ్‌లో పాల్గొన్న సిబ్బంది అందరికీ గుర్తింపు కార్డులను జారీ చేయడం జరుగుతుందని, ఈ నెల 22వ తేదీన నిర్వహించే మాదిరి కౌంటింగ్‌ నాటిక ఫొటోలతో సహా వివరాలు సమర్పించాలని కలెక్టర్‌ ఆదేశించారు. గుర్తింపు కార్డులు లేకుండా ఏ ఒక్కరిని కౌంటింగ్‌ హాల్‌లోకి అనుమతించడం జరగదని, ప్రతిఒక్కరూ తప్పనిసరిగా గుర్తింపు కార్డులతో రావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఓట్ల లెక్కింపు ప్రక్రియపై వివరించారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్‌, వనపర్తి, గద్వాల జేసీలు శ్రీనివాస్‌రెడ్డి, వేణుగోపాల్‌, నిరంజన్‌, ఏఆర్వోలు హనుమానాయక్‌, రాజేష్‌కుమార్‌, పాండు, వెంకటయ్య, రాములు, డీఆర్‌డీవో సుధాకర్‌, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...