ఆలయంలో హుండీలు లూటీ


Fri,May 17, 2019 02:33 AM

నవాబ్‌పేట: మండల పరిధిలోని గురుకుంట గ్రామ శివారులో గల శ్రీ షిర్డీ సాయిబాబ దేవాలయంలో బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలయని దుండగులు చోరీకి పాల్పడినట్లు ఎస్సై శివకుమార్‌ తెలిపారు. ఎస్సై శివకుమార్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గురుకుంట సాయిబాబ దేవాలయంలో బుధవారం రాత్రి సుమారుగా 12నుంచి 1గంటల ప్రాంతంలో చోరీ జరిగినట్లు చెప్పారు. ఈ చోరీలో ముగ్గురి నుంచి నలుగురు దొంగలు ఉన్నట్లు తెలిపారు. దేవాలయం వెనకాల భాగం నుంచి ప్రహరీగోడ పై నుంచి దూకి వచ్చిన దుండగులు నేరుగా దేవాలమంలోకి వెళ్లి అక్కడ ఉన్న మూడు హుండీలను బయటకు తీసుకువచ్చి పగులగొట్టినట్లు చెప్పారు. రెండు హుండీలు తెరిచి అందులో ఉన్న డబ్బులను తీసుకున్న తర్వాత మూడో హుండీ వద్దకు వెళ్లినట్లు చెప్పారు. మూడో హుండీని బద్దలు కొట్టే సమయంలో శబ్దం విన్న వాచ్‌మెన్‌ అక్కడికి వెళ్లి చూడగా ముఖానికి ముసుగులు వేసుకొని ఉన్న ముగ్గురు వ్యక్తులు ప్రహరీ దూకి పారిపోయినట్లు చె ప్పారు. రెండు హుండీల్లో సుమారుగా రూ. లక్ష వరకు డబ్బులు ఉండవచ్చని ఎస్సై తెలిపారు. పోలీస్‌ జాగిలం, క్లూస్‌టీమ్‌తో సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపినట్లు ఎస్సై తెలిపారు. వేలిముద్రలు సేకరించినట్లు తెలిపారు. ఈ సంఘటనపై కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఎస్సై శివకుమార్‌ తెలిపారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...