వివాహం వెంట.. విషాదం


Fri,May 17, 2019 02:32 AM

-రోడ్డు ప్రమాదంలో పెండ్లి కూతురి తండ్రి మృతి
మానవపాడు: విచిత్రాలు చేయుటయే విధికి అలవాటు..విషాదాన్ని పంచుటలో చేయదు ఏ లోటు.. అని ఓ సినీకవి చెప్పినట్లుగా బంధుమిత్రులను ఆహ్వానించి కూతురి పెళ్లి వైభవంగా జరిపిన తండ్రిని రోడ్డుప్రమాదంలో రూపంలో మృత్యువు కబళించింది. వివాహం అనంతరం అందరూ భోజనాలు చేసి ఇంటి దారి పట్టారు. ఆ సంతోషం మరువక ముందే ఇంతలోనే పెళ్లి కూతురు తండ్రి రోడ్డు ప్రమాదంలో మరణించాడన్న విషాద వార్త వినిపించింది.దీంతో ఒక్క సారిగా పెళ్ళింట విషాదం అలముకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.
మద్దూరు గ్రామానికి చెందిన రాముడుకు భార్య ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న రాముడు తన పెద్ద కూతురుకు కర్నూలు జిల్లా పెద్ద టేకూరుకు చెందిన యువకుడితో గురువారం పెద్దటేకూరులో వైభవంగా వివాహం చేశాడు. పెళ్లి విందు అయిపోయిన వెంటనే అందరూ ఇళ్లకు బయలు దేరారు.అనంతరం రాముడు కూడా మోటారు సైకిల్‌పై సొంత వూరు(మద్దూరు)కు బయలు దేరాడు.మార్గ మధ్యంలో పుల్లూరు టోల్‌గేట్‌ సమీపంలో కర్నూలు వైపు నుంచి వస్తున్న లారీ ముందు వెళుతున్న రాముడి వాహనాన్ని ఢీ కొనడంతో రాముడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...