ఆలయ భూములను అభివృద్ధి చేయాలి


Thu,May 16, 2019 01:51 AM

ఊర్కొండ: దేవాలయాల ఆధీనంలో ఉన్న భూములను అభివృద్ధి చేసి ఆదాయ వనరులుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర దేవదాయ, ధర్మదాయ ప్రత్యేకాధికారి, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ రమాదేవి అన్నారు. బుధవారం ఆమె మండలంలోని ఊర్కొండపేట అభయాంజనేయస్వామి ఆలయ భూములను పరిశీలించారు. స్వామివారి పేరు మీద ఊర్కొండ మండల కేంద్రంలో 396లోని 10.39 ఎకరాల పొలాన్ని పరిశీలించి మాట్లాడారు. ఆలయ భూములను అభివృద్ధి చేసి వాటి ద్వారా వచ్చే ఆదాయంతో అభివృద్ధి పనులు చేయాలని ఆలయ ఈవో రామశర్మకు సూచించారు. ఊర్కొండపేట ఆలయ భూముల వివరాలను తనకు తెలియజేయాలని సూచించారు. మండలంలో ఎక్కడైనా ఆలయ భూములు వినియోగంలో లేని వాటిని అభివృద్ధి పర్చి సాగు, ఇతరాత్ర అభివృద్ధి చేసి ఆదాయాలు వచ్చే విధంగా భూములను తీర్చిదిద్దాలని ఆమె పేర్కొన్నారు. అభివృద్ధి చేసిన పొలాలను సాగుకోసం రైతులకు కౌలుకు ఇవ్వడం ద్వారా ఆదాయం సమకూరుతుందని, కౌలుకు ఏటా వేరు వేరు వ్యక్తులకు ఇవ్వాలని సూచించారు. అదేవిధంగా ఊర్కొండపేటలో 238 సర్వే నంబర్‌లో ఉన్న 4 ఎకరాలు భూమి పత్రాలను వెంటనే ఇవ్వాలని ఆదేశించారు. ఆట్టి ఆలయ భూమి విషయంలో కల్వకుర్తి ఆర్డీవో రాజేష్‌కుమార్‌తో చర్చించి ఆలయ భూముల వివరాలను అందేటట్లు చూస్తానని ఆమె ఈవో కు తెలిపారు. అక్రమంగా ఆలయ భూములను ఎవరైనా స్వాధీన పర్చుకోవాలని చూస్తేవారి పై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఆమెవెంట అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసరాజు, వెంకటాచారి, ఇన్‌స్పెక్టర్‌లు వీణ, శకుంతల, కవిత, ఆలయ ఈవో రామశర్మ, ఆలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...