ఒట్ల లెక్కింపునకు సహకరించాలి


Thu,May 16, 2019 01:41 AM

-జిల్లా ఎన్నికల అధికారి, పార్లమెంట్‌ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి శ్రీధర్‌
నాగర్‌కర్నూల్‌ రూరల్‌ : లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా నిర్వహించేందుకు పూర్తి సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, పార్లమెంట్‌ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి శ్రీధర్‌ కోరారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై పోటీలో ఉన్న అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఓట్ల లెక్కింపు రోజున ఓట్ల లెక్కింపు కేంద్రంలో అభ్యర్థులు, వారి ఏజెంట్లు పాటించవల్సిన నియమ, నిబంధనలు, ఓట్ల లెక్కింపు ప్రక్రియ తదితర అంశాలపై వివరించారు. లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉయ్యాలవాడ సమీపంలోని మాడల్‌ బీఈడీ కళాశాల, నెల్లికొండ మార్కెట్‌ యార్డులో నిర్వహించడం జరుగుఉందన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ఈ నెల 19వ తేది లోగా ఓట్ల లెక్కింపులో పాల్గొనే వారి ఏజెంట్ల వివరాలు, ఫోటోలతో సహా సమర్పించాలని కోరారు. ఓట్ల లెక్కింపు రోజున స్ట్రాంగ్‌ రూమ్‌లను ఎన్నికల పరిశీలకులు, రిటర్నింగ్‌ అధికారి, అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల సమక్షంలోనే తెరవడం జరుగుతుందన్నారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8గంటలకు ప్రారంభమవుతుందని, అభ్యర్థులు, ఏజెంట్లు ఉదయం 7 గంటలకే కౌంటింగ్‌ హాల్‌కు చేరుకోవాలని కోరారు.

నాగర్‌కర్నూల్‌ సెగ్మెంట్లలో ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందన్నారు. మీడియా ప్రతినిధులను మీడియా కేద్రం వరకు ఎన్నికల సంఘం జారీ చేసిన పాసులు ఉన్న వారిని మాత్రమే అనుమిస్తారన్నారు. అక్కడి నుండి ప్రత్యేకంగా నియమించబడిన అధికారులు ఒక్కోసారి ఐదుగురిని ఎస్కార్ట్‌గా తీసుకొని వెళ్లి ఓట్ల లెక్కింపు కేంద్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డయాస్‌ నుంచి మీడియా ప్రతినిధులు ఫొటోలు, లేదా వీడియో తీసుకునేందుకు అనుమతి ఉంటుందన్నారు. ఫొటో, వీడియో జర్నలిస్ట్‌లు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈవీఎంలపై అభ్యర్థుల వారీగా నమోదయ్యే ఓట్ల సంఖ్య, పోస్టల్‌ బ్యాలెట్‌ తదితర వాటిని అందరికి కన్పించేలా తీయడానికి అనుమతి ఉండదని, దూరం నుంచి తీసుకోవచ్చన్నారు. ఈ నెల 26న ఎన్నికల వ్యయ పరిశీలకులు జిల్లాకు వస్తారని, ఆ రోజున పోటిచేసిన అభ్యర్థులందరు హాజరై వారికి సంబంధించిన ఖర్చుల లెక్కలను ఫైనల్‌ చేయాల్సి ఉంటుందన్నారు. ఎవరైనా అభ్యర్థి ఈ సమావేశానికి హాజరు కా కున్నా, ఖర్చుల వివరాల తుది నివేదిక సమర్పించకపోయినా భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు అని కలెక్టర్‌ తెలిపారు. సమావేశంలో జేసీ శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్వో మధుసూదన్‌నాయక్‌, నోడల్‌ అధికారులు, అభ్యర్థులు శృతి, స్వతంత్య్ర అభ్యర్థి శరత్‌, టీఆర్‌ఎస్‌ తరుపున భరత్‌, బీజేపీ తరుపున శ్రీనివాస్‌, సుబ్బారెడ్డి, కాంగ్రెస్‌ నుంచి డేవిడ్‌రాజు, బీఎస్పీ నుంచి నాగన్న పాల్గొన్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...