ఇష్టంతో నేర్చుకునే ప్రతి అంశం భావి జీవితానికి ఉపయోగం


Thu,May 16, 2019 01:41 AM

నాగర్‌కర్నూల్‌ రూరల్‌ : ఇష్టంతో నేర్చుకునే ప్రతి అంశం విద్యార్థుల భావి జీవితానికి ఉపయోగకరం అవుతుందని జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ అన్నారు. నాగర్‌కర్నూల్‌ కేజిబివిలో గత నెల 12వ తేది నుంచి ప్రారంభమైన వేసవి విడిది క్యాంపు 35 రోజుల పాటు నిర్వహించిన వేసవి విడిది క్యాంపు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వేసవి విడిది క్యాంపు వల్ల కేజీబీవీ విద్యార్థినిలు అద్భుతమైన ప్రదర్శనలు నేర్చుకున్నారని జిల్లా విద్యాధికారి వారి సిబ్బందిని, వందేమాతరం ఫౌండేషన్‌ వాలెంటర్లను కలెక్టర్‌ అభినందించారు. కేజీబీవీల్లో నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు వచ్చాయని, అందరు విద్యార్థినిలు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు మంచిగా చదువుకోవాలని, తను కూడా ప్రాథమిక విద్యా స్థాయి నుండి ఉన్నత విద్య వరకు రెసిడెన్షియల్‌ పాఠశాలలోనే చదువుకున్నానన్నారు. రెసిడెన్షియల్‌ పాఠశాలలో చదువుకునేందుకు ఎ క్కువ సమయం దొరుకుతుందని, వి ద్యా ర్థులు సమయాన్ని వృథా చేయకుండా చదువుపై శ్రద్ధ్ద వహించాలన్నారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలలో రాణించాలని పిలుపునిచా ్చరు. అనంతరం వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులు నేర్చుకున్న అంశాలను కలెక్టర్‌కు వివరించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటం, కరాటే, తదితర నృత్యాలు విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను కలెక్టర్‌ తిలకించారు. కార్యక్రమంలో డీఈవో గోవిందరాజులు, అధికారులు ఆహ్మద్‌, రాజశేఖర్‌రావు, ప్రత్యేకాధికారి శోభారాణి, వందేమాతరం ం లెంటీర్లు, విద్యార్థులు సితోల్గొన్నారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...