కౌంటింగ్‌ పకడ్బందీగా నిర్వహించాలి


Wed,May 15, 2019 02:43 AM

నాగర్‌కర్నూల్‌ రూరల్‌ : పార్లమెంట్‌ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌ను అధికారులు సమర్ధవంతంగా నిర్వహించాలని నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కౌంటింగ్‌ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఏఆర్వోలు, జిల్లా అధికారులు, కౌంటింగ్‌ నిర్వహించే ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... కౌంటింగ్‌ నిర్వహించే సిబ్బంది అప్రమత్తతో పనిచేసి కౌంటింగ్‌ సమర్ధవంతంగా నిర్వహించేందుకు ఏఆర్వోలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అసెంబ్ల్లీ నియోజకవర్గాల వారిగా ఓట్ల కౌంటింగ్‌ కోసం 14 టేబుల్స్‌ను పరిగణలోకి తీసుకొని ఒక్కో రౌండ్‌ చొప్పున కౌంటింగ్‌ నిర్వహించడం, మొత్తం 20 రౌండ్లు కౌంటింగ్‌ జరుగుతుందని తెలిపారు. సూపర్‌వైజర్‌ మిషన్‌ బటన్‌ నొక్కితే అసిస్టెంట్‌ సూపర్‌వైజర్‌ నమోదైన ఓట్లను రాసుకోవాలన్నారు. వీరిద్దరు పని చేస్తున్నారా లేదా అని పరిశీలించేందుకు ఒక మైక్రో అబ్జర్వర్‌ ఉంటారని తెలిపారు. 23వ తేదీన కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల కౌంటింగ్‌ ప్రారంభించడం జరుగుతుందన్నారు. -17 సీ ఫార్‌-2ను చెక్‌ చేయాలన్నారు. అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీఆర్వోలకు వివరించారు.

ఈ నెల 16వ తేదీన కౌంటింగ్‌ శిక్షణ తరగతులకు కౌంటింగ్‌ నిర్వహించే సిబ్బంది అందరు హజరు కావాలన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలను వెల్లడించే కౌంటింగ్‌ రోజుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్భందీగా చేసుకోవాలని, కౌంటింగ్‌ హాల్‌లో అవసరమైన మేర అత్యాధునిక సాంకేతికతో కూడిన కంప్యూటర్లను వినియోగించాలన్నారు. పోస్టల్‌ ఓట్ల వివరాలను రిటర్నింగ్‌ అధికారి మాత్రమే సువిధా వెబ్‌సైట్‌లో నమోదు చేస్తారని, రిటర్నింగ్‌ అధికారికి మాత్రమే సువిదా పోర్టల్‌ ఎడిట్‌ చేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ నెల 20న సుఖజీవన్‌రెడ్డి గార్డెన్‌ నందు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మాక్‌ కౌంటింగ్‌ నిర్వహించాలని, సహాయ రిటర్నింగ్‌ అధికారులు, అందరు కౌంటింగ్‌ సిబ్బంది తప్పకుండా హజరు కావాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో జేసీలు శ్రీనివాస్‌రెడ్డి, నిరంజన్‌, జిల్లా అధికారులు మధుసూదన్‌నాయక్‌, సింగారెడ్డి, అంజిలప్ప, మోహన్‌రెడ్డి, అఖిలేశ్‌రెడ్డి, ఆర్డీవోలు హనుమానాయక్‌, వెంకటయ్య, రాజేశ్‌కుమార్‌, కంప్యూటర్‌ ఆపరేటర్లు, పాల్గొన్నారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...