బాలల కథలకు ఆహ్వానం


Wed,May 15, 2019 02:41 AM

మహబూబ్‌నగర్‌, నమస్తే తెలంగాణ : చిల్డ్రన్స్‌ ఎడ్యుకేషనల్‌ అకాడమీ, బాల చెలిమి హైదరాబాద్‌ ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా బాలల కథల సంకలనం వెలువరించనున్నట్లు కథ సంకలనం రాష్ట్ర కన్వీనర్‌ గురిపల్లి అశోక్‌, ఉమ్మడి పాలమూరు జిల్లా కథా సంకలనం కన్వీనర్‌ డాక్టర్‌ భీంపల్లి శ్రీకాంత్‌ మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఈ సంకలనం కోసం ఉమ్మడి జిల్లాలోని బాల సాహితీవేత్తల కవులు, రచయితలు, ఉపాధ్యాయులు తమ కథలను పంపాలని కోరారు. బాలల కథలను తెలుగులో సంకలనంగా ప్రచురించడమే కాకుండా ఆంగ్లం, ఇతర భారతీయ భాషలలోకి అనువదించనున్నట్లు వారు తెలిపారు. ఆసక్తిగల రచయితలు ఇంతకుముందు ఏ పత్రికలలోపూ ముద్రితం కాకుండా ఉన్న నూతన ఒరవడి గల బాలల కథలను జూన్‌ 15 లోగా డాక్టర్‌ భీంపల్లి శ్రీకాంత్‌ ఇంటి నెం.8-5-38, టీచర్స్‌ కాలనీ, మహబూబ్‌నగర్‌ -509001 చిరునామాకు పంపాలని వారు తెలిపారు. పిల్లల కోసం పిల్లలు రాసినవి, పెద్దలు రాసినవి మూడు పేజీలకు మించకుండా, డీటీపీ అయితే పేజీన్నర నిడివి గల సృజనాత్మకత కథలను, ఆలోచనలు రేకెత్తించే, నైతిక విలువలు పెంపొందించే కథలను పంపాలని కోరారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...