చెక్కులు పంపిణీ


Wed,May 15, 2019 02:40 AM

వడ్డేపల్లి : వెల్దుర్తి వద్ద జరిగిన ఘోర రోడ్డు పమాదంలో మృతిచెందిన 14 కుటుంబాల వారికి జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ శశాంక ఆదేశాల మేరకు మంగళవారం రూ.50వేల విలువ గల చెక్కులను ఆర్డీఓ రాములు బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు. ప్రభుత్వం నుంచి అన్ని విధాల సాయం అందించడం జరుగుతుందని ఆర్డీఓ వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బీసన్నగౌడ్‌, తహసీల్దార్‌ వెంకటరమణ, ఎంపీడీఓ నరసింహా, ఆర్‌ఐ గురురాజ, సీనియర్‌ అసిస్టెంట్‌ మధు, వీఆర్‌ఓ నాగశేషన్న తదితరులు పాల్గొన్నారు.వెల్దుర్తి ప్రమాదంలో మరొకరు మృతివడ్డేపల్లి : కర్నూలు జిల్లా వెల్దుర్తి వద్ద జరిగిన ప్రైవేటు బస్సు-జీపు ఢీకొన్న ఘోర దుర్ఘటనలో తీవ్రగాయాలపాలై కర్నూల్‌ సర్వజన దవాఖానలో చికిత్స పొందుతున్న రామాపురం విజయ్‌(30) మృతిచెందాడు. ఈ నెల 11న జరిగిన ఈ ప్రమాదంలో తుఫాన్‌ వాహనంలో ప్రయాణిస్తున్న జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన 16 మందిలో 15 మంది అదేరోజు దుర్మరణం పాలయ్యారు. తీవ్రగాయాలతో బయటపడ్డ విజయ్‌ కర్నూలు దవఖానలో నాలుగు రోజులపాటు మృత్యువుతో పోరాడి మంగళవారం మృతిచెందాడు. తలకు, కాలుకు, కళ్ళకు తీవ్ర గాయాలై పక్కటెముకలు విరిగి కోమాలోకి వెళ్లాడు. మృతునికి భార్య రేణుక, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. నెల రోజుల క్రితమే కుమారుడు పుట్టగా.. తండ్రి ప్రమాదంలో మృత్యువాత పడటం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.‘రక్తదానం..

123
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...