వైద్యుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి మృతి


Wed,May 15, 2019 02:38 AM

వనపర్తి విద్యావిభాగం : వనపర్తి పట్టణంలోని వీకేర్‌ దవాఖానలో వైద్యుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి మృతి చెందిందంటూ చిన్నారి కుటుంబ సభ్యులు మంగళవారం దవాఖాన ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. కొత్తకోట మండలం అమడబాకులకు చెందిన సంధ్య మొద టి కాన్పు కోసం ఆదివారం దవాఖాన లో చేరగా ఆదివారం రాత్రి వైద్యులు ప్రసవం చేశారు. ప్రసవం అనంతరం చిన్నారి ఆనారోగ్యంగా ఉందని ఐసీయూలో ఉంచారన్నారు. అనంతరం క ర్నూల్‌ రెయిన్‌బో దవాఖానకు రెఫర్‌ చే యగా పరిస్థితి విషమించిందంటూ యాజమాన్యం కర్నూల్‌ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లమని పురమాయించా రు. ప్రభుత్వ దవాఖాన వైద్యులు అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వెల్లడించడంతో చేసేది లేక లబోదిబోమంటు వనపర్తిలోని వీకేర్‌ దవాఖాన ముందు ఆందోళనకు దిగారు. సకాలంలో వైద్యు లు స్పందించి ఉంటే ఈ దుస్తితి వచ్చేది కాదని కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఆసుపత్రి యజమాన్యాన్ని వివరణ కోరగా (9703473056, 23 3455, 8466809795 ) నంబర్లకు సంప్రదించగా గత రెండు రో జులుగా సెలవుల్లో ఉంటున్నామని, తమకెలాం టి సంబంధం లేదని వెల్లడించారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...