ముగిసిన ప్రచారం


Mon,May 13, 2019 03:33 AM

-ఇంటింటి ప్రచారం నిర్వహించిన టీఆర్‌ఎస్ నాయకులు
నారాయణపేట రూరల్ : ఈనెల 14వ తేదిన జరుగునున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచార పర్వం ఆదివారం సాయంత్రంతో ముగిసింది. ఆయా గ్రామాలలో ఎంపీటీసీలుగా బరి లో నిలిచిన అభ్యర్థులు, జెడ్పీటీసీ అభ్యర్థులు హోరా హోరీగా తమ ప్రచారాన్ని నిర్వహించారు. ఆదివారం జెడ్పీటీసీ అభ్యర్థి అంజలి రాములు బోయిన్‌పల్లి, లక్ష్మీపూర్, పేరపళ్ల, జాజాపూర్, ఎక్లాస్‌పూర్ గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటి నిర్మాణం చేపడుతున్న ఇంటి దగ్గరకు వెళ్లి కూలీలకు ఓటు అభ్యర్థించి కాసేపు తాపీ పని చేశారు. అదే విధంగా ఎంపీపీ అభ్యర్థి అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి చిన్నజట్రం, అంత్వార్, అయ్యవారి పల్లి గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎంపీటీసీ అభ్యర్థులు సునం ద బాలప్ప, సుగణ భగవంతు, జయలక్ష్మీ విశ్వనాథ్, భగవంతు, సుభద్రమ్మ, రాంరెడ్డి, జావీద్, శేఖరప్ప, దామోదరరెడ్డి, లాలు నాయక్, నారాయణ రెడ్డి, భగవంతు తదితర అభ్యర్థులు విస్తృతంగా తమ తమ గ్రామాలలో ప్రచారాలు నిర్వహించారు.

ధన్వాడలో..
ధన్వాడ : మండలంలో ఆదివారం టీఆర్‌ఎస్ ఎంపీటీసీ అభ్యర్ధులు ఇంటి ంటి ప్రచారాన్ని నిర్వహించారు. 11 ఎంపీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్ నాయకులు ఉద యం నుంచి సాయంత్రం దాకా ఇంటింటికి తిరిగి ప్రచార కార్యక్రమాన్ని ముగించారు. ధన్వాడ -1వ ఎంపీటీసీ అభ్యర్థి సురేఖారెడ్డి, ధన్వాడ-2వ ఎంపీటీసీ అభ్యర్థి శివారెడ్డి, ధన్వాడ-3వ ఎంపీటీసీ అభ్యర్థి బోర్ల శివాజీలు ఇంటింటి ప్రచారాన్ని నిర్వ హిం చారు. జెడ్పీటీసీ అభ్యర్ధి కమల ఆయా గ్రామాల్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ చిట్టెం అమరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ప్రధా న కార్యదర్శి చాకలి చంద్రశేఖర్, నీరటి రాంచద్రయ్య ముదిరాజ్, వార్డు సభ్యు లు శివరాములు, బాలరాజ్, లంకాల గోపాల్‌గౌడ్, చెట్టు కింది రాము, సంద చిన్న నర్సిములు, ఉట్కూర్ చంద్రయ్య, కందూర్ శ్రీనివాస్‌రెడ్డిలు పాల్గొన్నారు.

మరికల్‌లో..
మరికల్ : నూతనంగా ఏర్పడిన మం డలంలో అన్ని స్థానానల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని, టీఆర్‌ఎస్ గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమని టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, నర్వ లక్ష్మీకాంత్‌రెడ్డిలు పేర్కొన్నారు. చివరి రోజు ప్రచారంలో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ఎలిగండ్ల, అప్పంపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ద్వారానే గ్రామాల అభివృద్ధి సాధ్యమని, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులుగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ అ భ్యర్థులు రవికుమారయాదవ్, సుజాత శ్రీనివాస్, రామస్వామితోపాటు ఎలిగండ్ల ఎంపీటీసీ కృష్ణవేణి నారాయణరెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి గౌని సురేఖారెడ్డిలను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు ఎలిగం డ్ల సర్పంచ్ దేవమ్మ, ప్రకాశ్, హన్మిరెడ్డి, కృష్ణారెడ్డి, అనంత్‌రెడ్డి పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...