పది పరీక్షల ఫలితాలపై ఆందోళన వద్దు


Mon,May 13, 2019 03:32 AM

-పలు చోట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు
కోస్గి : పది పరీక్షల ఫలితాలు ఎలా ఉన్నా విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని విద్యార్థుల తల్లిదండ్రులు సహితం తమ పిల్లలను దండించ వద్దని పట్టణంలోని బాహర్ పేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్టేట్ రీసోర్సుపర్షన్ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం పాఠశాలలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి రోజుల్లో విద్యార్థులు పరీక్షల్లో ఫె యిల్ అయితే తీవ్ర మానసిక ఒత్తిడికి గురై జీవితంపై విరక్తి కల్గి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విలువైన జీవితాలను అవగాహన లోపంతొ తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. పది పరీక్షల ఫలితాలే జీవిత లక్ష్యం కాదని, ఈ పరీక్షల ఫలితాలలో ఫెయిల్ అయినా అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయన్నారు. ప్రతి విద్యా ర్థి ఆత్మ ైస్ధెర్యాన్ని కల్గి చదువు లేని వారు సహితం అద్భుతంగా తమకున్న అభిరుచి కల్గిన వృత్తిలో రా ణిస్తున్నారనే విషయాలను గుర్తించుకోవాలని పలు ఉదాహరణలు వివరించారు. కార్యక్రమంలో హెచ్ ఎం నారాయణరావు, ఉపాధ్యాయులు వెంకట్రాములు, గీతా లక్ష్మి, రాజేందర్‌రావు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...