పరిషత్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేద్దాం


Sun,May 12, 2019 01:55 AM

వంగూరు : 14న జరగనున్న ప్రాదేశిక ఎన్నికలలో గులాబీ జెండాను ఎగరవేయాలని అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కోరారు. శనివారం రాత్రి మండలంలోని ఎల్లమ్మ రంగాపూర్ గ్రామంలో పరిషత్ మూడో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్‌ఎస్ నాయకులు ధూంధాం కార్యక్రమాన్ని నిర్వహించారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ముఖ్య అతిథిగా హాజరై జెడ్పీటీసీ అభ్యర్థి నరేందర్‌రావు, ఎంపీటీసీ అభ్యర్థి సంధ్యా నర్సింహ్మారెడ్డిలకు మద్దతుగా ప్రచారానికి హాజరైనారు. ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన దూందాం కార్యక్రమం మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీ చేసిన అభివృద్ధ్దిని చూసి అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. మండలంలోని10 ఎంపీటీసీ ,జెడ్పీటీసీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమం భాగంగా టీవీ ఆంకర్ మంగ్లీ బృందం నిర్వహించిన ఆటా పాట పలువురిని అలరించాయి. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు కృష్ణారెడ్డి, సురేందర్‌రెడ్డి, నారయణరావు, హమీద్, ప్రవీణ్‌రెడ్డి, ఆనంద్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...