లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్‌కు ముగ్గురు ఎంపిక


Sun,May 12, 2019 01:54 AM

నాగర్‌కర్నూల్ టౌన్: వాయిస్ ఆఫ్ తెలంగాణ సంస్థ ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ముగ్గురు అవుట్ స్టాండింగ్, అచీవ్‌మెంట్ అవార్డులకు ఎంపికయ్యారు. కొన్ని రోజులుగా పేదలకు మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రిలో వైద్యరంగంలో అందించిన సేవలకు గుర్తింపుగా అర్థోపెడిక్ డాక్టర్ రాంకిషన్, జిల్లాకు చెందిన వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేస్తూ ఉత్తమ రైతుగా గుర్తింపు పొందిన తెలకపల్లి మండలం కార్వంగకు చెందిన కోసిరెడ్డి లావణ్యలకు వాయిస్ టుడే సంస్థ ఈ అవార్డులను అందజేయనుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును అందించడం సంతోషదాయకమన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో వారు అవార్డులను అందుకోనున్నారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...