ప్రతిపక్షాల మాయ మాటలు నమ్మొద్దు


Sun,May 12, 2019 01:53 AM

లింగాల: ప్రతి పక్షా పార్టీలు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దని టీఆర్‌ఎస్‌తోనే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. పరిషత్ ఎన్నికల్లో భాగంగా టీఆర్‌ఎస్ పార్టీ జెడ్పీటీసీ కేతావత్ నేజమ్మ, సభ్యులకు మద్దతుగా మండలంలోని సూరాపూర్, గ్రామాల్లో రోడ్‌షో,ఇంటింటి ప్రచారం నిర్వహించగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాల పట్టించుకోకపోవడం వల్లే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధ్దిని నోచుకోలేదన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డక రాష్ట్ర సీఎం కేసీఆర్ చిన్న పంచాయతీతోనే గ్రామాలు అభివృద్ధి సాద్యమవుతుందనే లక్ష్యంగా తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కోడ్ ముగిసిన అనంతరం అభివృద్ధి పుంజుకుంటుదన్నారు.ప్రతిపక్షాల తప్పుడు మాటలకు నమ్మి మోసపోవద్దని ఆదరిస్తున్న టీఆర్‌ఎస్ అభ్యర్థుల కారు గుర్తుకు ఓటు చేసిన భారీ మెజార్టీతో గెలిపంచాలని కోరారు.సూరాపూర్ గ్రామంలో ఆంజనేయస్వామి గుడి నిర్మాణానికి రూ.4లక్షలు, గుడి నిర్మాణానికి రూ.1లక్ష, కమ్యూనిటీ హాల్ కోసం రూ.5లక్షలు ప్రకటించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మాకం తిర్పతయ్య, ఎంపీపీ జగపతిరావు, సింగిల్ విండో చైర్మన్ వెంకట్‌రెడ్డి, అభ్యర్థి కేటీ తిర్పతయ్య,సర్పంచ్‌లు కోనేటి తిర్పతయ్య, హన్మంతునాయక్, లక్ష్మన్‌నాయక్,మండల పార్టీ అధ్యక్షుడు రానోజీ, శ్రీనివాసులు, తదితరలు పాల్గొన్నారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...