విద్యార్థులు ఆత్మైస్థెర్యంతో ఉండాలి


Sun,May 12, 2019 01:53 AM

నాగర్‌కర్నూల్ టౌన్: రేపు విడుదలయ్యే పదో తరగతి ఫలితాల విషయంలో విద్యార్థులు ఆత్మైస్థ్యెంతో ఉండాలని జిల్లా విద్యాధికారి గోవిందరాజులు ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు విడుదల కానున్న పదో తరగతి ఫలితాలపై విద్యార్థులు మానసిక ైస్థెర్యం నింపేందుకు ప్రధానోపాధ్యాయలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహిస్తున్నారన్నారు. ఫలితాలు ఎలా వచ్చినా మానసిక ైస్థెర్యాన్ని విద్యార్థులు ఎవరు కూడా కోల్పోకూడదని ఈసందర్భంగా డీఈవో సూచించారు. పరీక్షల్లో తప్పితే దారి నుంచి గుణపాఠం నేర్చుకోవాలే తప్పా విద్యార్థులు ఆవేశంలో అనైక్యత ఆలోచనలతో ఆత్మహత్యలకు పాల్పడి అర్థంతరంగా బావి బంగారు జీవితాన్ని చిదిమేసేలా ముగించవద్దన్నారు.

పదో తరగతి ఫలితాలు విడుదలయ్యే వరకు విద్యార్థులను మానసికంగా సంసిద్ధం చేసేందుకు రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశాలతో జిల్లా విద్యాశాఖాధికారి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులతో, వారి తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారన్నారు. ప్రధానోపాధ్యాయులు సంబంధిత సబ్జెక్టు ఉపాధ్యాయులు విద్యార్థిని స్థాయి అంచనా బట్టి ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉందో తల్లిదండ్రులకు ముందే తెలియపరచాలని ప్రధానోపాధ్యాయులకు, మండల విద్యాధికారుల ద్వారా ఆదేశాలు జారీ చేశామని డీఈవో అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం తెలకపల్లి మండలం కార్వంగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు కౌన్సిలింగ్ నిర్వహించారు. ప్రభుత్వ పరీక్షల నిర్వాహణ అధికారి రాజశేఖర్‌రావు, డీఈవో గోవిందరాజులు ఫోన్ ద్వారా విద్యార్థులతో మాట్లాడారు. రేపు విడుదల కానున్న పదో తరగతి పరీక్షా ఫలితాల్లో నాగర్‌కర్నూల్ జిల్లా రాష్ట్రస్థాయిలో ఉత్తమ స్థానం సాధిస్తుందనే ఆశాభావాన్ని డీఈవో గోవిందరాజులు వ్యక్తం చేశారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...