మూడో విడత విధులు బాధ్యతగా నిర్వహించాలి


Sun,May 12, 2019 01:53 AM

నాగర్‌కర్నూల్ రూరల్ : ఎన్నికల సమాచారాన్ని అందించడంలో రెండు విడతల్లో చూపించిన స్ఫూర్థినే కొనసాగించాలని జిల్లాప డిప్యూటీ సీఈవో మొగులప్ప సిబ్బందికి సూచించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమాచార కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి, సేకరించిన 20 మండ సమాచారాన్ని క్రోడికరించి జిల్లా ఉన్నతాధికారులతో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎప్పటికప్పుడు వేళకు సమాచా చేరవేశారన్నారు. జిల్లా స్థాయిలో ఎన్నికలు నిర్వహించే సిబ్బంది అంకిత భావంతో పని చేశారని ప్రశంసించారు. రెండు విడతల్లో సమాచారం అందించడంలో విజయం సాధించారని, మూడో విడత ఎన్నికలు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా సమర్థవంతంగా సమాచారం సేకరించాలని సూచించారు. రెండు దశల్లో చూపించిన స్ఫూర్తినే కొనసాగించాలని సిబ్బందిని కోరారు. విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ సీఈవో నాగమణి, షాహిదాభేగం, సుజాత, నజీరొద్దిన్, యాదయ్య, యూసుఫ్, రాంబాబు, జిలానిలను ప్రశంసించారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...