చికిత్స పొందుతూ వ్యక్తి మృతి


Sun,May 12, 2019 01:52 AM

వనపర్తి రూరల్: మండలంలోని సవాయిగూడెం గ్రామానికి చెందిన గంథం బాలపీర్ హైదరబాద్‌లో ఉస్మానియ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. రూరల్ పోలీస్ సేష్టన్ ఎఎస్సై బాలయ్య తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం గంధం బాలపీర్ రంగపురం గ్రామంలో చుట్టాల పెండ్లికి వెళ్లి ద్విచక్రవాహనంపై వస్తుండగా నాచహళ్లి గ్రామ సమీపంలో అదుపు తప్పి గాయపడ్డాడు.వెనక వస్తు న్న ఇతరులు చూసి అంబులెన్స్‌కు ఫోన్ చేసి జిల్లా దవాఖానకు తరలించారు. వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఉస్మానియ దవా ఖానకు తరలించాలని సూచించారు.వెంటనే హైదరాబాద్‌లోని ఉస్మానియా దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ శని వారం ఉదయం మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారని ఏ ఎస్సై వివరించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించామని, మృతుడికి భార్య, ముగ్గురు కూతురున్నట్లు తెలిపారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...