ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి


Sat,May 11, 2019 01:02 AM

నాగర్‌కర్నూల్ రూరల్ : లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏర్పాట్లు ప కడ్బందీగా చేయాలని నాగర్‌కర్నూల్ పా ర్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. మండలంలోని నెల్లికొండ మార్కెట్ గోదాం, ఉయ్యాలవాడలోని మాడ్రన్ బీఈడీ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేం ద్రాలను శుక్రవారం కలెక్టర్ జిల్లా అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌటింగ్ కేంద్రాల వద్ద బయట బారికేడింగ్‌తో పా టు, లోపల కూడా బారికేడింగ్, మెష్ తదితర వాటిని ఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలో ఆర్‌ఎండ్‌బీ అధికారులకు సూ చించారు.

అదే విధంగా రెండు కేంద్రాల వద్ద ఎన్నికల పరిశీలకులు, రిటర్నింగ్ అధికారికి, జిల్లా ఎన్నికల అథారిటీలకు ప్రత్యేకంగా రూముల ఏర్పాటును స్వ యంగా పరిశీలించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ కేంద్రాల్లో పనిచేసే సిబ్బందికి, మీడియా వారికి భోజన సదుపాయం ఎక్కడ ఏర్పాటు చే యాలో వివరించారు. భోజన ఏర్పాట్ల లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని జిల్లా వ్యవసాయాధికారి బైరె డ్డి సింగారెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల తాగునీటి సౌ కర్యం కల్పించాలని మున్సిపల్ కమిషన ర్ జయంత్ కుమార్‌రెడ్డికి ఆదేశించారు.

కౌంటింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సీసీ కెమెరాలు, టీవీ లు, డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలని సాంఘిక సంక్షేమశాఖాధికారి అఖిలేష్‌రెడ్డిని ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రా ల వద్ద చేయాల్సిన ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించారు. కలెక్టర్ వెంట ముఖ్య ప్రణాళికాధికారి మోహన్‌రెడ్డి, మీడియా నోడల్ అధికారి అంజిలప్ప, ఆర్‌ఎండ్‌బీ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ లక్ష్మినారాయణ, డీటీ ఖాజామైనొద్దిన్ ఉన్నారు.

82
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...