టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిద్దాం


Sat,May 11, 2019 01:00 AM

వంగూరు : స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జెడ్పీటీసీ, ఎంపీటీపీ అభ్యర్థులను గెలిపించాలని ఎంపీటీసీ అభ్యర్థులు భీమమ్మ, కాశమ్మ, చంద్రయ్య కోరారు. శుక్రవారం మండలంలోని కొండారెడ్డిప ల్లి, జాజాల, ఉల్పర, రంగాపూర్, వంగూరులో ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గాజర, పోల్కంపల్లి, డిండిచింతపల్లి, సర్వారెడ్డిపల్లి, వెంకటాపూర్ ఎంపీటీ సీ పరిధిలో సైతం అభ్యర్థు లు టీఆర్‌ఎస్ నేతలతో కలిసి జోరుగా ప్రచారం చేశారు. సర్వారెడ్డిపల్లిలో టీఆర్‌ఎస్ నేతలు పెద్దెత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే ఎమ్మెల్యే గు వ్వల బాలరాజు సహాకారంతో గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నా రు. చౌదర్‌పల్లి, పోల్కంపల్లి గ్రామాల్లో జెడ్పీటీసి అభ్యర్థి నరేందర్‌రావు ఇంటిం టి ప్రచారం చేపట్టి కారు గుర్తుకు ఓటు వే యాలని కోరారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు గణేష్‌రావు, మాజీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ రాజశేఖర్‌రెడ్డి, మాజీ చైర్మ న్ నరేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, కో-అప్షన్ హామీద్, యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు లాలూయాదవ్ పాల్గొన్నారు.

చారకొండలో..
టీఆర్‌ఎస్ పార్టీతోనే గ్రామాలు సమాగ్రాభివృద్ధి చెందుతాయని టీఆర్‌ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థి ఠాగూర్ బాలాజీసింగ్ అన్నారు. శుక్రవారం సర్పంచ్ విజేందర్‌గౌడ్‌తో కలిసి మండల కేంద్రంతో పాటు తిమ్మాయిపల్లి, సారకబండ తండా, తుర్కలపల్లి, కమాల్‌పూర్ తండాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చారకొండ జెడ్పీటీసీగా తనను గెలిపిస్తే మండలానికి అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. 14న జరిగే ఎన్నికల్లో ఎంపీటీసీకి, జెడ్పీటీసీకి కారు గుర్తుపై ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు మహేశ్, లక్ష్మమ్మ, అలివేల, రాజునాయక్, ఎంపీటీసీ అభ్యర్థులు నిర్మల, లలితబాల్‌సింగ్, మండలాధ్యక్షుడు గురువయ్యగౌడ్, రైతు సమితి మండల కోఆర్డినేటర్ యాదయ్య పాల్గొన్నారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...