మైనార్టీ గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల


Sat,May 11, 2019 12:59 AM

నాగర్‌కర్నూల్ రూరల్ : తెలంగాణ మైనార్టీస్ గురుకుల పాఠశాలల్లో వివిధ తరగతుల్లో ప్రవేశాలకు ఇటీవల నిర్వహించిన అర్హత ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలైనట్లు నాగర్‌కర్నూల్ పాఠశాల ప్రిన్సిపాల్ నాగరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తీర్ణులైన విద్యార్థుల జాబితా పాఠశాలకు చేరినట్లు తెలిపారు. ఈ మేరకు ఎంపికైన విద్యార్థులకు ఆయా పాఠశాలల నుంచి ఫోన్ ద్వారా సమాచారం అందించనున్నట్లు తెలిపారు. 5వ తరగతిలో మొత్తం 80సీట్లకు ముస్లిం విద్యార్థులు-55, క్రిష్టియన్ విద్యార్థులు-2, ఎస్సీ-5, ఎస్టీ-3, ఓసీ-2, బీసీ-10, మొత్తం 77మంది విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపారు. అదేవిధంగా 6,7,8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల (మైనార్టీ సీట్లకు మాత్రమే)కు విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపారు. 6వ తరగతిలో 10మంది, 7వ తరగతిలో 3, 8వ తరగతిలో 8మంది విద్యార్థులు ఎంపికైనట్లు తెలిపా రు. ఎంపికైన విద్యార్థులు ఈనెల 20లోగా గత పాఠశాలలో చదివిన ఒరిజినల్ బోనఫైడ్, ఆదాయ ధ్రువ పత్రం, ఆధార్‌కార్డు, కుల ధ్రువ పత్రాల జిరా క్స్ కాపీలు, తల్లితండ్రులవి, విద్యార్థులవి 2 పాస్ ఫోర్టు సైజు ఫొటో తీసుకుని రావాలన్నారు. జిల్లా కేంద్రంలోని పాఠశాల భవనం స్నేహపురి కాలనీ లో పద్మావతి జూనియర్ కళాశాల సమీపంలో బీఈడీ కళాశాల భవనంలోకి మార్చినట్లు తెలిపారు. వివరాలకు 9704703298 సంప్రదించాలన్నారు.

124
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...