సువిధ లింక్ వినియోగించాలి


Sat,May 11, 2019 12:59 AM

నాగర్‌కర్నూల్ టౌన్ : పార్లమెంట్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియను సువిధ లింక్ ద్వారానే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సూచించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లాల అధికారులతో ఢిల్లీ నుంచి వీడియో కా న్ఫరెన్స్ ద్వారా లెక్కింపుపై పలు సూచనలు చేశారు. ఈనెల 23న నిర్వహించనున్న పార్లమెంట్ ఎన్నికల లెక్కింపు ఏర్పాట్లు, సువిధ లింక్ ద్వారా లె క్కింపు ప్రక్రియ ఎలా నిర్వహించాలనే పలు అంశాలపై చర్చిస్తూ సూచనలు చేశారు. ఇందుకోసం ఈనెల 21న సువిధ లింక్ ద్వారా నిర్వహించే లెక్కింపు ప్రక్రియను ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు కేంద్ర ఎన్నికల సంఘం పంపించిన డెమో నిర్వహించడం జరుగుతుందన్నారు. కౌంటింగ్ ప్రకియ నిబంధనల అనుగుణంగా శిక్షణ పొందాలని అధికారులకు సూచించారు. కౌంటింగ్ ప్రక్రియను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. వీసీలో నాగర్‌కర్నూల్ నుంచి కలెక్టర్ శ్రీధర్, నోడల్ అధికారి సాయిసుమన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీరాములు, ఆర్డీవో పాండునాయక్, కంప్యూటర్ ఆపరేటర్ రమేశ్, జగదీశ్, మనోహర్, మదన్, భాస్కర్ పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...