హరితహారాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టండి


Fri,May 10, 2019 02:59 AM

నారాయణపేట, నమస్తేతెలంగాణ : కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని నారాయణపేట కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు. కలెక్టర్ ఛాంబర్‌లో గురువారం ఏర్పాటు చేసిన అగ్రి ఫారెస్ట్ కమిటీ సభ్యులతో కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ మాట్లాడుతూ అగ్రి ఫారెస్ట్ స్కీం స్టేట్ లేవల్‌లో ఏర్పాటు అయినందున జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించడం జరిగిందన్నారు. నర్సరీల్లో చందనం, టేకు, నీలగిరి, సరుగుడు, వెదురు, సుబాబు మొక్కలను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా చందనం మొక్కలను పెంచేందుకు అధిక ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఏ పొలంలో ఏలాంటి రకమైన మొక్కలు పెరుగుతాయనే విషయాన్ని అగ్రికల్చర్, అర్టికల్చర్ అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్ధారించాలన్నారు. రైతులకు ఎలాంటి మొక్కలు కావాలో రెండు, మూడు రోజుల్లో ప్లాన్ తయారు చేసి అందించాలని అగ్రికల్చర్ అధికారికి కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఎఫ్‌వో గంగిరెడ్డి, అర్టికల్చర్ అధికారిణి సరోజినిదేవి, పశుసంవర్ధకశాఖ డాక్టర్ దుర్గయ్య, అగ్రికల్చర్ ఎడీఎ జాన్ సుధాకర్‌లు పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...