పంచాయతీ కార్యదర్శులు జాబితా విడుదల


Fri,May 10, 2019 02:59 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసులు క్రీడాశాఖల ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఇటీవల సచివాలయంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుకై దరఖాస్తు చేసుకున్న (క్రీడాకోట) వారి స్పోర్ట్స్ సర్టిఫికెట్స్‌పై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగిందని జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సమావేశంలో శాట్స్ వి.సి. యం.డి. శ్రీదినకర్ బాబు, ఐఎఎస్, హోమ్ డిపార్ట్‌మెంట్, పంచాయతీరాజ్ డిపార్టుమెంట్ , శాఖల అధికారులు పాల్గొన్నారని తెలిపారు. సమావేశంలో ప్రధానంగా జీవోఎంఎస్ నెం.74, వ్యాట్ అండ్ సీ (ఎస్) డిపార్ట్‌మెంట్ తేదిః 09-08-2012 నందు గల నియమ నిబంధనలు అన్ని జిల్లాల నుంచి పంచాయతీ కార్యదర్శులకై క్రీడా కోటలో దరఖాస్తు చేసుకున్న వారి క్రీడా సర్టిఫికెట్స్, శాట్స్‌అధికారులు పరీక్షించిన తీరు తదితర ముఖ్యాంశములు గురించిన సమీక్ష నిర్వహించారని తెలిపారు.సమావేశంలో జీవో లోని క్రీడాంశములు,సదరు క్రీడాంశములు స్థాయిని అనుసరించి ఇచ్చిన ప్రాధాన్యత, జీవో ప్రకారం అర్హత లేని క్రీడలు, టోర్నమెంట్స్ అదేవిధంగా ప్రాధాన్యత క్రమంలో ఛాంపియన్‌షిప్ గురించి సమీక్షించారు. క్రీడాకోటలో అర్హులైన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల అభ్యర్థుల నియామకంలో పూర్తి పారదర్శకతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కమిటీ నిర్ణయించిందన్నారు. ఇందుకు శాట్స్, జిల్లాల నుంచి అందిన సమాచారం ఆధారంగా తయారు చేసిన జిల్లాల వారి ప్రిలిమినరీ ప్రాధాన్యతగల అభ్యర్థుల జాబితాను కలెక్టర్ కార్యాలయం, జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాలు మరియు జిల్లా యువజన, క్రీడా అధికారుల కార్యాలయాలు నందు అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. లోయర్ లెవల్ సర్టిఫికెట్స్ ఇవ్వనివాళ్లు ఇప్పుడు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. వీటియందు ఏవేని అభ్యంతరాలు ఉన్న యేడల తగు పత్రములతో తేదిః 14-05-2019 సాయంత్రం 5 గంటల దాకా సదరు జిల్లా పంచాయతీ అధికారికి సంబంధిత స్పోర్ట్స్ సర్టిఫికెట్లను జతచేస్తూ వ్రాత పూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుందన్నారు. సముచిత అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని పూర్తి జాబితా తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. జీవోకి విరుద్దమైన అభ్యంతరాలు స్వీకరించబడవని, ప్రాధాన్యత ఇవ్వబడదని, క్రీడా కోటలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాలకై దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు గమనించాలని సూచించారు.

పంచాయతీ కార్యదర్శుల నియామకంలో క్రీడా సర్టిఫికెట్ల పునః పరిశీలన
జూనియర్ పంచాయతీ రాజ్ కార్యదర్శుల పోస్టుల నియామకంలో స్పోర్ట్స్ కోటా కింద సర్టిఫికెట్లు పునః పరిశీలన చేయనున్నట్లు డీవైఎస్‌వో టీవీఎల్ సత్యవాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 7న రాష్ట్ర ప్రభుత్వ యువజన సర్వీసులు, క్రీడాశాఖ కార్యదర్శి అధ్యక్షతన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్న (క్రీడా కోటా) వారి స్పోర్ట్స్ సర్టిఫికెట్లపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. శాట్ వైస్ ఛైర్మన్, పంచాయతీరాజ్ జీఏడీ అధికారులు పాల్గొన్నారన్నారు. అన్ని జిల్లాల నుంచి పంచాయతీ కార్యదర్శుల కోసం క్రీడా కోటాలో దరఖాస్తు చేసుకున్న వారి క్రీడా సర్టిఫికెట్లు, శాట్ అధికారులు పరిశీలించిన తీరు తదితర అంశాల గురించి సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. క్రీడా కోటలో అర్హులైన జనియర్ పంచాయతీ కార్యదర్శుల అభ్యర్థుల నియామకంలో పూర్తి పారదర్శకతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కమిటీ నిర్ణయించిందని తెలిపారు. జిల్లాల నుంచి అందిన సమా ఆధారంగా తయారు చేసిన జిల్లాల వారి ప్రిలిమినరీ ప్రాధాన్యత అభ్యర్థుల జాబితాను కలెక్టర్ కార్యాలయం, జిల్లా యువజన, క్రీడాశాఖ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. లోయర్ లెవల్ సర్టిఫికెట్లు ఇవ్వని వాళ్లు ఇప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలని కోరారు. వీటి ఏవైనా అభ్యంతరాలు ఉంటే తగు పత్రాలతో ఈనెల 14న సాయంత్రం 5 గంటల వరకు జిల్లా పంచాయతీ అధి సంబంధిత సర్టిఫికెట్లు జతచేస్తూ రాతపూర్వకంగా తెలి కోరారు. అభ్యంతరాలను పరిగణలోకి తీసు పూర్తి జాబితా తయారు చేయడం జరుగుతుందన్నారు. జీవోకి విరుద్ధమైనవి జరగదని తెలిపారు. క్రీడా కోటాలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ విషయాలను గుర్తించుకోవాలని ఆమె కోరారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...