పారదర్శకంగా వ్యవసాయ మార్కెట్


Fri,May 10, 2019 02:57 AM

వనపర్తి, నమస్తే తెలంగాణ : వనపర్తి నూతన వ్యవసాయ మార్కెట్‌లో పారదర్శకంగా దుకాణాల కేటాయింపు జరుగుతుందని, లబ్ధిదారులను లక్కీడిప్ ద్వారానే ఎంపిక చేయడం జరుగుతుందని, ఇందులో ఎలాంటి పైరవీలకు తావు లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎంవైఎస్ ఫంక్షన్ హాల్లో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు సంబంధించిన వ్యాపారస్తులతో నూతన మార్కెట్ నిర్మాణంపై మర్యాదపూర్వక భేటీకి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ నూతన వ్యవసాయ మార్కెట్ రాష్ట్రానికే ఆదర్శంగా ఉండాలని, ఈ విషయంలో వ్యాపారులు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. నూతనంగా నిర్మించే మా ర్కెట్ యార్డ్‌లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందు కు ప్రభుత్వం పూర్తి స్థాయి ప్రణాళిక సిద్ధం చేసిందని, వ్యాపారస్తులతో పాటు రైతులు, హమాలీలు, చాటకూలీలందరికి మార్కెట్లో తాగునీరు, విశ్రాంతి గదులు, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, మార్కెట్ నిర్మాణం పూర్తయితే పట్టణంలో కూడా ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వనపర్తి జెడ్పీటీసీ అభ్యర్థి లోక్‌నాథ్‌రెడ్డి, మాజీ ఎంపీపీ శంకర్‌నాయక్, వ్యవసాయ మార్కెట్ యార్డ్ వ్యాపారస్తులు ఉన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...