ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తాం


Fri,May 10, 2019 02:57 AM

మక్తల్, నమస్తే తెలంగాణ/ఊట్కూర్ : నారాయణపేట జిల్లాలో శుక్రవారం జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ పకడ్బందీగా నిర్వహిస్తామని పే ట జిల్లా కలెక్టర్ వెంకట్రావు అన్నారు. గురువారం మ క్తల్ మండల పరిషత్ కార్యాలయం, ఊట్కూర్ ప్ర భుత్వ జూనియర్ కళాశాలల వద్ద పోలింగ్ అధికారు లు, సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎ న్నికల విధులపట్ల సిబ్బంది ఎవరైన నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. పో లింగ్ కేంద్రాల్లో రాజకీయ పార్టీల నాయకులకు తలొగ్గకుండా విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లోకి ఇంక్ బాటీళ్లు, పెన్నులు తీసుకురాకుండా ఓటర్లను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. ఓటరు వద్ద కచ్చితంగా గుర్తింపు కా ర్డులను చూడాలని పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ప్రశాంతమైన వాతావరణంలో జరిపేందుకు అన్ని చర్యలు తీ సుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. అనంతరం మక్తల్‌లో ఎన్నికల సిబ్బందికి ఏర్పాటు చేసిన భోజనాలను కలెక్టర్ పరిశీలించారు. ఊట్కూర్ మండలంలో పోలిం గ్ ఏర్పాట్లను ఎంపీడీవో జయశంకర్ ప్రసాద్, సెక్టోరియల్ అధికారిణి కళాందినిలతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో నారాయణపేట డీఆర్వో, మక్తల్ ఎన్నికల స్పెషల్ ఆఫీసర్ రవికుమార్, అసిస్టెం ట్ రిటర్నింగ్ అధికారి విజయనిర్మల, తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట నిఘా
మక్తల్, నమస్తే తెలంగాణ : నారాయణపేట జిల్లా లో రెండో విడత జరుగుతున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తున్నామని నా రాయణపేట ఎస్పీ డాక్టర్ చేతన పేర్కొన్నారు. మక్తల్ ఎస్‌ఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో గురువారం మక్తల్ షిర్డీ సాయిబాబా ఫంక్షన్‌హాల్‌లో ఎన్నికల బం దోబస్తులో పాల్గొనే సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి ఎస్పీ హాజరై సిబ్బందికి పలు సూచనలు అందించారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒక డీఎస్పీ, ముగ్గురు సీఐలు, 12 మంది ఎస్‌ఐలతోపాటు, 301 మంది సిబ్బందితో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద రెండంచెల బందోబస్తు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. పో లింగ్ కేంద్రాల వద్ద రాజకీయ పార్టీల నాయకులు ఓ టర్లను ప్రలోభాలకు గురి చేస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...