తమాషా చేస్తున్నారా..?


Fri,May 10, 2019 02:56 AM

-మిషన్ భగీరథ అధికారులపై ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి ఫైర్
ధన్వాడ : నీళ్లు లేక ప్రజలు అల్లాడుతుంటే మీరు తమాషా చేస్తున్నారా..ఇలాగైతే ఊరుకునేది లేదంటూ నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మిషన్ భగీరథ అధికారులపై ఫై ర్ అయ్యారు. ధన్వాడలోని లక్ష్మీవాడలో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని, దీంతో అ వీధి ప్రజలు రాత్రి సమయంలో మంచినీళ్ల కోసం అవస్థలు పడుతున్నాని పలువురు టీఆర్‌ఎస్ నాయకులు గురువారం ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. మిషన్ భగీరథ నీళ్లు ఒక రోజు వస్తే నాలుగు రోజుల వరకు రావడం లేదని ఎమ్మెల్యేతో వాపోయారు. దీనిపై స్పం దించిన ఎమ్మెల్యే మిషన్ భగీరథ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారిని ఫోన్ ద్వారా సంప్రదించి నీటి సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. విధి నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని హెచ్చరించారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...