నేడు పాలమూరులో మెగా జాబ్ మేళా


Fri,May 10, 2019 02:55 AM

మహబూబ్‌నగర్ వైద్యవిభాగం : ప్రధానమంత్రి కౌశల్ కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రధాన మంత్రి కౌశల్ కేంద్ర ఉద్యోగ ఉఫాధి కల్పన అధికారి విశ్వనాథ్‌రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన మంత్రి కౌశల్ కేంద్రంలో నిరుద్యోగులకు ఉపాధి ఆవకాశాలు కల్పించే విధంగా మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 8వ తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హతలు ఉన్నవారు జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని, వివరాల కోసం 6301753522, 63017 53523 నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...