రెండో విడత ప్రచారానికితెర..!


Thu,May 9, 2019 01:47 AM

కల్వకుర్తి, నమస్తే తెలంగాణ : మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో రెండో విడత ఎన్నికలకు గాను బుధవారం సాయంత్రానికి ప్రచార పర్వం ముగిసింది. పరిషత్ ఎన్నికల్లో భాగంగా జిల్లాలో రెండో విడతలో కల్వకుర్తి, వెల్దండ, ఊర్కొండ, తెల్కపల్లి, తాండూర్ మండలాలకు సంబంధించి 5 జెడ్పీటీసీ, 52 ఎంపీటీసీ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగ 5 మండలాల్లోని 52 ఎంపీటీసీ స్థానాలకు 165 మంది అభ్యర్థులు, 5 జెడ్పీటీసీ స్థానాలకు 20 మంది అభ్యర్థులు ఎన్నికల రంగంలో ఉన్నారు.

నామినేషన్ల ఉప అనంతరం అభ్యర్థులకు గుర్తులు ఖరారు అయినప్పటి నుంచి ప్రచారం ఉపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెట్ అభ్యర్థులు గ్రామాలలో విస్త్రృతంగా కల్వకుర్తి మండలంలో... కల్వకుర్తి మండలంలో మొత్తం 36,595 మంది ఓటర్లు తమ ఓటు హక్కును పరిషత్ ఎన్నికల్లో వినియోగించుకోనున్నారు. ఉపసంహరణల అనంతరం 11 ఎంపీటీసీ స్థానాలకు 36 మంది, 1 జెడ్పీటీసీ స్థానానికి 5 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. జెడ్పీటీసీ స్థానాన్ని ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతుగంటి రాములు కుమారుడు పోతుగంటి భరత్ ప్రసాద్ జెడ్పీటీసీ ఎన్నికల రంగంలో నిలిచారు.

వెల్దండ మండలం... మండలంలో 30,316 మంది ఓటర్లు ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణల అనంతరం 11 ఎంపీటీసీ స్థానాలకు 42 మంది, జెడ్పీటీసీ స్థానానికి 5 మంది అభ్యర్థులు ఎన్నికల రంగంలో ఉన్నారు. జెడ్పీటీసీ స్థానాన్ని జనరల్ మహిళకు కేటాయించడంతో కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్‌పర్సన్ విజితారెడ్డి జెడ్పీటీసీ స్థానంలో ఎన్నికల బరిలో నిలిచారు.

ఊర్కొండ మండలం.. మండలంలో 26,267 మంది ఓటర్లు ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణల అనంతరం 6 ఎంపీటీసీ స్థానాలకు 18 మంది, జెడ్పీటీసీ స్థానానికి 4గురు అభ్యర్థులు రంగంలో ఉన్నారు. జెడ్పీటీసీ స్థానం ఎస్సీ మహిళకు కేటాయించారు. టీఆర్‌ఎస్ నుంచి జెడ్పీ అభ్యర్థిగా శాంతకుమారిఎన్నికలరంగంలో నిలిచారు తెల్కపల్లి మండలం.. మండలంలో 40,104 మంది ఓటర్లు ఉన్నారు.ఉపసంహరణల అనంతరం 14 ఎంపీటీసీ స్థానా 40 మంది, జడ్పీటీసీ స్థానానికి 4 గురు అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.తెల్కపల్లి జెడ్పీటీసీ స్థానం ఎస్సీ మహిళకు కేటాయించడంతో టీఆర్‌ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థిగా పద్మావతి ఎన్నికల రంగంలో నిలిచారు.తాడూర్ మండలం.. మండలంలో 27,232 మంది ఓటర్లు ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణల అనంతరం 11 ఎంపీటీసీ స్థానాలకు 29 మంది, జెడ్పీటీసీ స్థానానికి ఇద్దరు అభ్యర్థులు రంగంలో ఉన్నారు. స్థానం జనరల్ మహిళకు కేటాయిండంతో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి వేంకటేశ్వరమ్మ జెడ్పీటీసీ ఎన్నికల బరిలో నిలిచారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...