టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకుందాం


Thu,May 9, 2019 01:45 AM

కల్వకుర్తి, నమస్తే తెలంగాణ : కారుగుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకుందామని, గ్రామాభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమని మాజీ మంత్రులు పోతుగంటి రాములు, చిత్తరంజన్‌దాస్ పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ జెడ్పీటీసీ అభ్యరిత భరత్‌ప్రసాద్‌తో పాటు ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా బుధవారం కల్వకుర్తి మండలం మార్చాల, ఎలికట్టతండా, గుండూర్ గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం పథకాలను వివరిస్తూ.. టీఆర్‌ఎస్ అభ్యర్థులకు గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభల్లో మాజీ మంత్రులు మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఎంజీకేఎల్‌ఐ ను పూర్తి చేసి కల్వకుర్తి మండలానికి సాగునీరు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ద్వారా కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి సాగునీరు ఇచ్చే విధంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ రైతు పక్షపాతి అని, బలపర్చిన అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. జెడ్పీటీసీ అభ్యర్థి భరత్ మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామం అభివృధ్ధికి పాటుపడతానని, కల్వకుర్తి మండల వాసులకు సేవకునిగా పనిచేస్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ అభ్యర్థులు మల్లేశ్, రవీందర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు విజయ్‌గౌడ్, వైస్ ఎంపీపీ పర్వతాలు, సర్పంచ్‌లు రాకేశ్, లింగారెడ్డి, బాలస్వామిగౌడ్ పాల్గొన్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...