విద్యార్థిని మృతి


Thu,May 9, 2019 01:44 AM

నారాయణపేట క్రైం : పేట పట్టణంలోని మేదరివీధిలో నివాసం ఉం టున్న ధరణి(16) అనే విద్యార్థిని అనారోగ్యం కారణంగా స్థానిక సర్కారు దవాఖానలో చికిత్స పొందుతోంది. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు అంబులెన్స్‌లో తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే...పేట పట్టణంలోని మేదరివీధిలో నివాసం ఉంటు న్న మోహన్, సంగీతల కుమార్తె ధరణి ధన్వాడ మండల కేంద్రంలోని మాడల్ స్కూల్‌లో ఇటీవల 9వ తరగతి పూర్తి చేసింది. పరీక్షల అనంతరం వేసవి సెలవులు కావడంతో 10వ తరగతి అడ్వాన్స్‌డ్ సబ్జెక్టుల కోసం నారా యణపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో నిర్వహిస్తున్న కో చింగ్‌కు వెళ్తుండేది. రోజు మాదిరిగానే కోచింగ్‌కు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చి అనారోగ్యం బారిన పడింది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు ఆమెను రెండు రోజుల క్రితం స్థానిక సర్కారు దవాఖానకు తీసుకెళ్లారు. ఆమె పరిస్థితిని గమనించిన స్థానిక వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. ఆమెను అంబులెన్స్‌లో తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. వడదెబ్బ తగిలి బాధితురాలు మృతి చెందినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు.కడుపునొప్పి భరించలేక వివాహిత ఆత్మహత్యనారాయణపేట క్రైం : కడుపునొప్పి బాధ భరించలేక ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఈ నెల 7న చోటుచేసుకోగా బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని బాహర్‌పేట్ వీధికి చెందిన షాకిల్ అహ్మద్‌కు మూడేళ్ల క్రితం మహారాష్ట్రకు చెందిన సుఫియాతాజ్‌తో వివాహం జరిగింది. కొంతకాలంగా సుఫియాతాజ్ కడపునొప్పితో బాధపడుతుండేది. ఈ క్రమంలో కడుపునొప్పి బాధ అధికం కావడంతో నొప్పి భరించలేక పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. ఈ సంఘటనపై ఆమె తల్లి అమీనాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...