గులాబీ జెండా ఎగరేద్దాం


Thu,May 9, 2019 01:44 AM

వెల్దండ : కారు గుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్ బలపర్చిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి నాగర్‌కర్నూల్ జెడ్పీపై గులాబీ జెండా ఎగరేద్దామని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని కొట్ర, వెల్దండ, చెదురుపల్లి గ్రామాల్లో జెడ్పీటీసీ అభ్యర్థి విజితారెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి కారు గు ర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వెల్దండ జెడ్పీటీసీ అభ్యర్థి విజితారెడ్డి, ఎం పీటీసీ అభ్యర్థులను గెలిపించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే రూ.4లక్షల కో ట్ల నిధులతో గ్రామాలను అభివృద్ధి చేసుకుందామన్నారు. జిల్లాల్లో అన్ని జెడ్పీటీసీలను గెలిపించుకొని నాగర్‌కర్నూల్ జిల్లా జెడ్పీపై గులాబీ జెండాను ఎగురవేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రూ.4లక్షల కోట్లతో రాష్ట్రంలోని 33 జిల్లాలో 12571 జీపీల్లో కనీస అవసరాలు తీర్చేందుకు అభివృద్ధి ప్రణాలిక సిద్ధం చేస్తున్నట్లు ఆ యన తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ వెంకటయ్యగౌడ్, సింగిల్‌విండో చైర్మన్ మోహన్‌రెడ్డి, సర్పంచ్‌లు భూపతిరెడ్డి, వెంకటేశ్వర్‌రావు, దార్లకుమార్, ఎంపీటీసీ కృష్ణ య్య, నాయకులు సంజీవ్‌కుమార్, భాస్కర్‌రావు, యాదగిరి, సమీర్‌బాబా, శేఖర్, దేవేందర్, ప్రవీణ్, శ్రీను, నిరంజన్, అభ్యర్థులు రాములు, దీపిక, విజయ ఉన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...