కత్తితో బెదిరించి నగదు, బంగారం అపహరణ


Thu,May 9, 2019 01:43 AM

నారాయణపేట క్రైం : అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉన్న వారిని తాళ్లతో బందించి, నోట్లో గుడ్డలు కుక్కి, కత్తితో బెదిరించి 8వేల నగదు, నాలుగు తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణాలు అపహరించుకెళ్లిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి పేట జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితురాల కథనం మేరకు.. పట్టణంలోని హైదరాబాద్ రోడ్ మార్గంలో కవితకృపాకర్‌రెడ్డి దంపతులు గత కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. కృపాకర్‌రెడ్డి కుటుంబ పోషణకు ప్రైవేటు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కవిత కూలీ పని చేస్తుండేది. ఈ క్రమంలో రోజువారి మాదిరిగానే ఇద్ద రూ పని నిమిత్తం తమ ఇంట్లో అత్త, అమ్మమ్మలను ఉంచి వెళ్లారు. ఇంట్లో ఉన్న వారి దగ్గరకు సాయంత్రం సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ద్వి చక్రవాహనంపై వచ్చి ఎవరెవరు ఇంట్లో ఉంటారని వివరాలను అడిగి వెళ్లిపోయారు. తీర రాత్రి తలుపులు, కిటికీలు మూసుకొని కుటుంబసభ్యులు నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించారు. కవితతో పాటు ఆమె అత్త, అమ్మమ్మలను కాళ్లను, చేతులకు తాళ్లతో బందించారు. అరవకుండా నోట్లో గుడ్డలు పెట్టి కత్తితో బెదిరించారు. బీరువాలో ఉన్న నగదు, తమ కుటుంబసభ్యుల ఒంటిపై ఉన్న పుస్తెలతాడు, చెవికమ్మలను అపహరించుకొని వెళ్లిపోయారు. ఆ సమయంలో ఆమె భర్త కృపాకర్‌రెడ్డి ఇంట్లో లేడు. ఈ సంఘటనపై నారాయణపేట డీఎస్పీ శ్రీధర్ చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. వివరాలు బాధితులను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సంపత్ తెలిపారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...