సీసాట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోండి


Wed,May 8, 2019 02:32 AM

నాగర్‌కర్నూల్ రూరల్ : కేంద్ర, రాష్ట్ర సర్విసుల్లో ఉన్నతమైన ఐఏఎస్, ఐపీఎస్ సర్విసుల్లో చేరాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుద్యోగ పట్ట భద్రులు మే, జూన్ నెలలో నిర్వహించే సీ సాట్ (సీఎస్‌ఏటీ) పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సాంఘీక సంక్షేమాధికారి అఖిలేష్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. సీఎస్‌ఏటీ 2020 పరీక్ష కోసం టీఎస్ స్టడీ సర్కిల్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో జూన్ 9న తెలంగాణ రాష్ట్ర పాత జిల్లా కేంద్రాల్లో ఈ ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి వివరాలు www.isstudyeircle. telangana.gov.in లో పొందుపర్చినట్లు తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎన్నికైన అభ్యర్థులకు 11నెలల పాటు ఉచిత భోజన వసతితో పాటు నిష్నాతులైన అధ్యాపకులతో శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. వారం వారం పరీక్షలు నిర్వహించి వాటిపై విశ్లేషణ క్లాసులు ఏర్పాటు చేస్తారన్నారు. ఈ శిక్షణ కాలంలో అభ్యర్థులకు రూ.10వేల విలువ గల పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, జిరాక్స్ మెటిరియల్ అందజేస్తారన్నారు. ప్రతి విద్యార్థి వ్యక్తిగతంగా, ప్రశాంతంగా చదువుకునేందుకు లైబ్రెరిలో ప్రత్యేకంగా క్యూబికల్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. కంప్యూటర్ ల్యాబ్‌తో పాటు ఇంటర్నెట్ వైఫై సౌకర్యం ఉందన్నారు. అభ్యర్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలు, దిన పత్రికలు, వార, నెల వారి పత్రికలు పోటీ పరీక్షలకు అవసరమైన మెటిరియల్స్ అందుబాటులో ఉంచుతారన్నారు. ఈ శిక్షణ కాలంలో అభ్యర్థులకు వ్యక్తిగత అవసరాల కోసం మహిళా అభ్యర్థులకు నెలకు రూ.1000, పురుషులకు రూ.750 ఇవ్వనున్నట్లు తెలిపారు. సీఎస్‌ఏటీ -2020 పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి అవసరమైన మెయిన్స్ పరీక్షలకు శిక్షణ ఇస్తారన్నారు. దీనికి అవసరమైన ఖర్చులను సంస్థ భరిస్తుందని, వీరికి ఈ శిక్షణ కాలంలో రూ.3వేల చొప్పున ప్రత్యేక అలవెన్స్ రూపంలో అందజేస్తారన్నారు. ఈ సంస్థలో శిక్షణ పొందిన అభ్యర్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కీలకమైన పదవుల్లో కొనసాగుతున్నారన్నారు. కాబట్టి ఆసక్తి గల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ పరీక్షల కోసం అభ్యర్థులు మే 31వ తేదీలోపు దరఖాస్తు చేసి జూన్ 9న నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరుకావాలన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...