పరిషత్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి


Wed,May 8, 2019 02:31 AM

అచ్చంపేట, నమస్తే తెలంగాణ : పరిషత్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవా రం అచ్చంపేట మండలంలో సిద్దాపూ ర్, పద్మారంతండా, మన్నెవారిపల్లి, అ క్కారం, దండ్యాల, ఆంజనేయతండా, ఘనపురం, బొమ్మన్‌పల్లి, ఐనోలు గ్రా మాల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన మొదటగా సిద్దాపూర్ సమీపంలోని రామునిపాదం గుట్టపై పూజ లు చేశారు. అనంతరం ఆయా గ్రామా ల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇంతకాలం ప్రజలను ముంచి తిరిగి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అచ్చంపేట మండలంలో టీఆర్‌ఎస్ బలపర్చిన జె డ్పీటీసీ, 8మంది ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అందరం కలిసికట్టుగా గ్రామాలను అన్ని రంగా ల్లో అభివృద్ధి చేసుకుందామనన్నారు. పార్టీ, ప్రజల కోసం నిస్వార్థంగా సేవలు అందించే వారికి అవకాశాలు కల్పించామన్నారు. మరోసారి ప్రజలు కారు గు ర్తుకు ఓటువేసి సత్తా చాటాలని కోరా రు.

అచ్చంపేట ప్రాంతానికి సాగునీరు తీసుకొచ్చి రైతుల కన్నీళ్లు తుడుస్తానన్నారు. అందరి ఆశీస్సులతో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించారని అచ్చంపేట ను మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. మన్నెవారిపల్లిని ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వర్తింప చేసేందు కు కృషి చేస్తానని సాధ్యమయ్యే వరకు ఎక్కువ పరిహారం అందించేందుకు కృషి చేస్తానన్నారు. మిగిలిన గ్రామాలు కూడా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలని అడుగుతున్నారని ఈ విష యం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అంతకుముందు సిద్దాపూ ర్ ఆలయ నిర్మాణానికి తన నిధుల నుంచి రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమితి అధ్యక్షుడు మనోహర్, మండలాధ్యక్షుడు నర్సింహ్మగౌడ్, రా జేందర్, ఎంపీపీ పర్వతాలు, రైతు సమితి మండలాధ్యక్షుడు రా జేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ తులసీ రాం, స ర్పంచులు కవిత, లాలు, సోమ్లా, చం ద్రకళ, నర్సింహ్మ, భాస్కర్, వైస్ ఎంపీపీ సేవ్యనాయక్ పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...