మిషన్ భగీరథ పనులు భేష్‌


Fri,April 26, 2019 02:01 AM

కొల్లాపూర్, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటిని అందించేందు కోసం ప్రభుత్వం నిర్మించిన మిషన్ భగీరథ పథకం దేశానికే ఆదర్శమని మహారాష్ట్ర జీవన ప్రాధికారణ్, కార్యదర్శి సభ్యుడు పీ.వెల్స్రు (ఐఏఎస్) అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ ఉన్నతా ధికారుల బృందంతో ఆయన గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద నిర్మించిన మిషన్ భగీరథ ప్రాజెక్టు పనుల తీరును వారు భగీరథ పథకం ఎస్‌ఈ చెన్నారెడ్డి, ఈఈలు సింగ్, శ్రీధర్‌రావు, డీఈలు రమేశ్, అంజత్‌అలీ, ఏఈలు మల్లేశ్వర్‌రావు, నవీన్‌లతో కలిసి పరిశీలిం చారు. మహారాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎల్లూరు వద్ద నిర్మించిన మిషన్ భగీరథ పథకంలోని మోటార్లను రన్ చేసి మోటార్ల ద్వారా నీటిని తోడే పనితీరును పరిశీలించారు. పంప్‌హౌస్‌లో అమర్చిన 12 మోటార్లు, స్వీచ్ యార్డును, కనెక్షన్ వెల్‌ను ఆ బృందం ఆ ప్రాంతమంతా కలియ తిరుగుతూ క్షుణ్ణంగా పరిశీలించారు. తమకు తలెత్తిన అనుమానాలను ఎస్‌ఈ చెన్నారెడ్డిని అడిగి నివృత్తి చేసుకున్నారు. అయితే మొదట వారు మిషన్ భగీరథ ప్రాజెక్టు నిర్మాణ నమూనాను, ప్రాజెక్టులోని వివిధ భాగాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్‌ను ఐఏఎస్ అధికారి పీ.వెల్స్రు, ఇతర అధికారులు వీక్షించారు. అనంతరం అక్కడే మిషన్ భగీరథ ఎస్‌ఈ చెన్నారెడ్డి, ఇతర అధికారులతో మహారాష్ట్ర ఉన్నతాధికారులు సమావేశమై ప్రాజెక్టు నిర్మాణం ప్రణాళిక, అంచనా వ్యయం, మోటార్లు తయారీ పలు ఆంశాల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆ రాష్ట్ర జీవన ప్రాధికారణ్, కార్యదర్శి సభ్యుడు (ఎంజేపీ) ఐఏఎస్ అధికారి పీ.వెల్స్రు విలేకరులతో మాట్లాడుతూ మిషన్ భగీరథ ప్రాజెక్టు నిర్మాణం పనులు నాణ్యతతో ఎంతో చక్కగా పటిష్టంగా నిర్మాణం చేయడం పట్ల తాము సంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మిషన్ భగీరథ పథకాన్ని చేపట్టి ప్రతి ఇంటికీ నల్లా ద్వారా సరఫరా చేయడం ఎంతో అభినందనీయమన్నారు. ఇదే మిషన్ భగీరథ పథకం తరహాలో మహారాష్ట్రలో కూడా నిర్మించ తలపెట్టామని, అందుకోసం తెలంగాణలో నిర్మించిన మిషన్ భగీరథ నిర్మాణాలను పరిశీలించి ఆకలింపు చేసుకోవడానికే తాము వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పనులు తమకు ఎంతో సంతృప్తినిచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఈ బృందంలో ఆ రాష్ర్టానికి చెందిన చీఫ్ ఇంజినీర్లు చంద్రకాంత్ గజ్‌బై, విజయ్‌గట్కర్, సూపరింటెండెంట్ ఇంజినీర్ అజయ్‌సింగ్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గవ్వాన్‌కార్ ఉన్నారు. అనంతరం ఈ బృందం నాగర్‌కర్నూల్ మండలం గుడిపల్లిగట్టుపై నిర్మించిన మిషన్ భగీరథ నిర్మాణ పనులను సందర్శించి, పరిశీలించారు.

నీటి సరఫరా భేష్
నాగర్‌కర్నూల్ రూరల్ : ఇంటింటికీ తాగునీటి సరఫరా చేపట్టే మిషన్ భగీరథ పథకం పనితీరు భేష్‌గా ఉందని, మహారాష్ట్ర నుంచి వచ్చిన డెలిగేషన్ కమిటీ ప్రశంసించింది. మిషన్ భగీరథ పథకం పనితీరును పరిశీలించేందుకు మహారాష్ట్ర నుంచి వచ్చిన ఈ బృందం మండలంలోని గుడిపల్లి, నర్సాయిపల్లి, వనపట్ల గ్రామాల్లో అంతర్గత తాగునీటి సరఫరా పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికీ ఇచ్చిన నల్లా కనెక్షన్ విధానాన్ని పరిశీలించారు. ఫ్లో కంట్రోల్ వాల్స్ పనితీరును పరిశీలించారు. గ్రామంలో అందరికీ సమానంగా నీళ్లు అందించే విధానాన్ని ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి సరఫరా కోసం చేపట్టిన పథకం ఎంతో బాగుందని బృందం సభ్యులు అభినందించారు. ఈ బృందంలో అడిషనల్ ఛీఫ్ సెక్రెటరీ శ్యాంలాల్ గోయల్, మెంబర్ సెక్రెటరి వాసు, మహారాష్ట్ర వాటర్ సప్లయ్ ఛీఫ్ ఇంజినియర్ చంద్రకాంత్, ఈఈ గవాంకర్, ఆర్‌డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజినియర్, ఈఈ శ్రీధర్‌రావు, డిప్యూటీ ఈఈ భరతసింహారెడ్డి, సర్పంచ్‌లు అల్లెమ్మ, వసుమతి, నాయకులు రామకృష్ణారెడ్డి, నర్సింహారెడ్డి, స్వామి, రాములు ఉన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...