ముగిసిన నామినేషన్ల పరిశీలన


Fri,April 26, 2019 01:59 AM

నాగర్‌కర్నూల్ రూరల్ : జిల్లాలో మొదటి విడతలో నిర్వహిస్తున్న పరిషత్ ఎన్నికల్లో భాగంగా ఏడు మండలాలకు గానూ నామినేషన్ల ప్రక్రియ ముగియగా గురువారం నాగర్‌కర్నూల్ జిల్లాలో ఆయా మండలాల్లో నమోదైన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ గురువారం నిర్వహించారు. ఆయా మండల కేంద్రాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పొద్దుపోయే వరకూ కొనసాగింది. వివిధ కారణాలతో పలు నామినేషన్లను తిరస్కరించగా రెండు సెట్లు వేసిన నామినేషన్ల నుంచి ఒక్కో అబ్యర్థికి సంబంధించిన ఒక్కొక్క నామినేషన్‌నే అధికారులు గుర్తించారు. ఈ మేరకు అధికారులు వెల్లడించిన నామినేషన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలో మొత్తం 91 ఎంపీటీసీ స్థానాలకు గానూ 727 నామినేషన్లు దాఖలు కాగా పరిశీలనలో 105 నామినేషన్లు వివిధ కారణాల చేత తొలగిపోగా 622 మిగిలాయి. 7 జెడ్పీటీసీలకు గానూ 80 నామినేషన్లు దాఖలు కాగా వివిధ కారణాల చేత 10 తొలగిపోగా 70 నామినేషన్లు మిగిలాయి.జిల్లాలో దాఖలైన మొత్తం నామినేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...