గెలుపే లక్ష్యంగా పనిచేయాలి


Fri,April 26, 2019 01:59 AM

అమ్రాబాద్ : స్థానిక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజారటీతో గెలిపించాలని స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కోరారు. గురువారం అమ్రాబాద్ మండలంలో, పదర మండలంలో మద్దిమడుగులో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడుతూ వచ్చేనెల 14న జరిగే స్థానిక ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులను ఎంపిక బాధ్యత కార్యకర్తలదేనని అమ్రాబాద్, పదర మండలాల పై అన్ని స్థానాల్లో గులాబీ జెండాను ఎగురవేయాలని కో రారు.

ఇందుకు అణుగుణంగా కార్యకర్తలు సహకరించాలని ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలను ఇంటింటికీ చేర్చే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలన్నారు. అమ్రాబాద్, పదర మండలాల పై ప్రత్యేక దృష్టి పెట్టానని ఈ ప్రాంతంలో కరువును శాశ్వితంగా దూరం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నానని, ఈ మండలాల పై ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌ల తో చర్చించినట్లు పేర్కొన్నారు. మరో రెండు రోజుల్లో ఎంపీటీసీ అభ్యర్థులను ప్రకటిస్తానన్నారు. అనంతరం పోటీలో ఉండాలని ఆసక్తి చూపే అభ్యర్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇప్పలపల్లి బిక్యా, చిట్లంకుంట దశరథంలను ఎంపీటీసీ అభ్యర్థులుగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఇప్పలపల్లి, మద్దిమడుగు గ్రామాలకు చెందిన 20మంది నాయకులు టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యే సమక్షంలో చేరారు. వారిలో నారాయణరెడ్డి, ఆంజనేయులు, మల్లయ్య, లింగయ్య, అంజి తదితరులు ఉండగా నేతలు మండల అధ్యక్షుడు చెన్నకేశవులు, రా ంబాబు, సుధాకర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, రా జారాం, సోఫి, తిరుమలయ్య, ఎల్లయ్య, శ్రీనివాసులు, వెంకటయ్య, రవిచంద్ర, అనీల్, మల్లేశ్‌లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...