జలాశయాల గణన సమర్థంగా నిర్వహించాలి


Fri,April 26, 2019 01:59 AM

నాగర్‌కర్నూల్ రూరల్: జిల్లాలో భూగర్భ, ఉపరితల జలాల, చిన్నతరహా, తాగునీటి, సాగునీటి పథకాలు ఎన్ని ఉన్నాయో లెక్క తేల్చేందుకు జలాశయాల గణన ప్రక్రియున సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు..జిల్లాలో చిన్నతరహా సాగు, తాగునీటి వనరుల గణన చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ఎన్నికల కోడ్ అనంతరం జిల్లాలో గణన ప్రక్రియ ప్రారంభించి పూర్తిగా కంప్యూటరీకరణ చేయాల్సి ఉంటుందని, ఈ మేరకు జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి మోహన్‌రెడ్డి సమన్వయకర్తగా ఆరో చిన్న తరహా నీటి వనరుల గణన నిర్వహించనున్నట్లు తెలిపారు. మండలస్థాయిలో ఈ బాధ్యతలు తహసీల్దార్లు చేపట్టనున్నట్లు వెల్లడించారు. గణనపై అవగాహన కల్పించేందుకు గ్రామస్థాయిలో వీఆర్వోలు, వీఆర్‌ఏలు పాల్గొంటారని, వీరిపై పర్యవేక్షకులుగా ఏఎస్‌వోలు, పంచాయతీరాజ్ ఏఈలు, నీటిపారుదల, విద్యుత్ ఏఈలు వ్యవహరిస్తారన్నారు. సర్వే సమయంలో ముఖ్యంగా చెరువులు, నీటి పథకాల వివరాలు సేకరించాల్సి ఉందన్నారు.

ఐదేళ్లకు ఒకసారి చేపట్టే సర్వేలో చెరువులు, బావులు, ఉప నదులు, వాగులు ఎన్ని ఉన్నాయా అనే వివరాలు వెల్లడి కానున్నాయన్నారు. ఆరో చిన్నతరహా నీటి వనరుల గణన నిమిత్తం భూగర్భ జల వనరుల పథకం ఉపరితల నీటి పారుదల పథకాల సవరణ చేపట్టబోతుందన్నారు. తక్కువ నీటి ఊట, గొట్టపు బావుల లోతు, వ్యాసాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారన్నారు. వ్యవసాయేతరాల కింద ఉపయోగించిన వాటిని పరిగణలోకి తీసుకుంటారన్నారు. ఇప్పటికే సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఈ సమావేశంలో ముఖ్య ప్రణాళికాధికారి మోహన్‌రెడ్డి, డీఆర్‌వో మధుసూదన్‌నాయక్, జిల్లా నీటి పారుదల శాఖాధికారి మురళీ, వ్యవసాయాధికారి సింగారెడ్డి, పశు సంవర్ధక శాఖ అధికారి అంజిలప్ప, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారి సుధాకర్‌రెడ్డి, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వెంకటయ్య, గ్రామీణాబివృద్ధి శాఖాధికారి సుధాకర్, జిల్లా శిశు సంక్షేమాధికారి ప్రజ్వల పాల్గొన్నారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...