పర్యావరణ పరిరక్షణకు అడవులను కాపాడుకోవాలి


Fri,April 26, 2019 01:58 AM

అమ్రాబాద్ రూరల్ : పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యత, మానవాళికి ప్రాణవాయువు ఉండాలంటే అడవులను కాపాడుకోవల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అమ్రాబాద్ రేయింజ్ డీఆర్‌వో లక్ష్మికాంతరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ కళాశాలకు చెందిన విద్యార్థులు గురువారం అడవుల సంరక్షణ- ప్రాధాన్యత అంశంపై అవగాహన కోసం ఒక రోజు విజ్ఞానయాత్రలో భాగంగా మండల పరిధిలోని మన్ననూర్ గ్రామంలో గల అటవీశాఖకు చెందిన పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కళాశాల విద్యార్థులను ఉద్దేశించి డీఆర్‌వో మాట్లాడుతూ నల్లమల కొండలు తెలంగాణ, ఏపీలోని ఐదు జిల్లాలను కలుపుకుని ఉన్నాయన్నారు. ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన అడవులల్లో అమ్రాబాద్ రిజర్వు అడవులు ఒకటని.. భారతదేశంలోనే అతిపెద్ద రిజర్వు టైగర్ అటవీ ప్రాంతం నల్లమల కొండలని వివరించారు. దేశంలోనే అరుదైన జంతువు మౌస్‌డీర్ (మూషికజింక)ల పార్కును నల్లమలలో ప్రత్యేక నిపుణుల పర్యవేక్షణలో వాటి మనుగడ కొనసాగుతుందని గుర్తు చేశారు. ఈ అడవులు మొత్తం 5,928 వేల స్కేయర్ కిలో మీటర్ల వరకు వ్యాపించి ఉన్నాయని, ఈ అడవుల గుండా కృష్ణనది 179 కిలో మీటర్ల దూరం ప్రయాణం చేస్తుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 3,300 పెద్దపులులు ఉండగా అత్యధికంగా భారత దేశంలోనే 70 శాతం అనగా 2,200 వరకు పెద్దపులులు ఉన్నట్లు అధికారులు గుర్తించారన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌ఎస్‌వో రవి, మహేందర్‌రెడ్డి, పాలెం వ్యవసాయ కళాశాల డాక్టర్లు భార్గవి, ఎల్లగౌడ్‌లు, విద్యార్థులు ఉన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...