భూ రికార్డుల ప్రక్షాళన వేగవంతం చేయాలి


Fri,April 26, 2019 01:58 AM

నాగర్‌కర్నూల్ రూరల్ : ధరణి, భూ ప్రక్షాళన కార్యక్రమం వేగవంతం చేయాలని జేసీ శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ ప్రజావాణి సమావేశ మందిరంలో ఆర్డీవోలు, తహసీల్దార్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు ధరణి పెండింగ్ పనులపై జేసీ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో భూ ప్రక్షాళన కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని ఆర్డీవోలు, తహసీల్దార్లను ఆదేశించారు. ధరణి వెబ్‌సైట్లో ఉన్న సందేహాలపై అవగాహన కల్పించారు. మండలంలో ప్రభుత్వ భూములు, ఇతర వివరాలను కూడా వెబ్‌సైట్లో నమోదు చేయాలన్నారు. కోర్టు కేసులో ఉన్న పెండింగ్ భూముల వివరాలు నమోదు చేయకూడదన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2,41,525 డిజిటల్ సంతకాలు పూర్తి చేశారని, ఇంకా పెండింగ్‌లో ఉన్న 3,226 డిజిటల్ సంతకాలను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. పారదర్శకంగా పనులను కొనసాగించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో మధుసూధన్‌నాయక్, ధరణి కో-ఆర్డినేటర్ వినోద్ ఉన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...